పెళ్లి అయిన పురుషులు, పెళ్లికాని స్త్రీలు... అత్యంత సంతోషంగా ఉంటారా? ఎందుకు?

ప్రపంచంలోనే అత్యంత సంతోషంగా ఉండేది ఎవరనే ప్రశ్నకు ... పెళ్లి అయిన మగాడు, పెళ్లి కానీ స్త్రీ.. అని సింపుల్ ఆన్సర్ చెప్తారు నిపుణులు. ఎందుకంటే మ్యారేజ్ తర్వాత పురుషుడు.. సరైన క్రమశిక్షణతో మెలుగుతాడు. బాధ్యతలను మోస్తూ

Update: 2024-07-05 16:40 GMT

దిశ, ఫీచర్స్: ప్రపంచంలోనే అత్యంత సంతోషంగా ఉండేది ఎవరనే ప్రశ్నకు ... పెళ్లి అయిన మగాడు, పెళ్లి కానీ స్త్రీ.. అని సింపుల్ ఆన్సర్ చెప్తారు నిపుణులు. ఎందుకంటే మ్యారేజ్ తర్వాత పురుషుడు.. సరైన క్రమశిక్షణతో మెలుగుతాడు. బాధ్యతలను మోస్తూ బుద్ధిగా వ్యవహరిస్తాడు. ఎలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కుకుండా, అసలు అలాంటి పనుల జోలికి పోకుండా ఉంటాడు. ధూమపానం, మద్యానికి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తాడు. అదే సింగిల్ బాయ్స్ విషయానికి వస్తే ఈ రెండు విషయాల్లో టోటల్ ఆపోజిట్ గా ఉంటారు. ఎప్పుడు దూకుడుగా వ్యవహరిస్తారు. ప్రమాదం ఉందని తెలిసినా అలాంటి పనుల్లోనే వేలు పెట్టేస్తారు.

అంతేకాదు పురుషులు పెళ్లి తర్వాత భావోద్వేగ మద్దతు పొందుతారు. ఏ కష్టం వచ్చినా, సక్సెస్ చూసినా.. భార్య దగ్గర ఆ పరిస్థితి గురించి చెప్పుకుని సలహా తీసుకుంటాడు. ఆ బాధ నుంచి విముక్తి.పొందుతాడు. సంతోషాన్ని రెట్టింపు చేసుకుంటాడు. 24 గంటలు తనను సంరక్షించే ఓ తోడు ఉందనే ఆనందంలో ఉంటాడు. . టైంకు బ్రేక్ ఫాస్ట్, వ్యాయామం, లంచ్, డిన్నర్ లాంటివి సమకూర్చేందుకు భార్య ఉంటుంది కాబట్టి హెల్తీగా, హ్యాపీగా ఉంటారు. సరైన లైఫ్ స్టైల్ తో నడుచుకుంటూ రోగాలకు కూడా దూరంగానే బతికేస్టాడు. పిల్లలు, భార్యను చూసుకుని మురిసిపోతూ ఆనందంగా గడుపుతాడు. ఇక భార్య కూడా జాబ్ చేస్తే ఇద్దరి జీతంతో తమకు నచ్చిన విధంగా జీవిస్తూ మరింత హ్యాపీగా ఉంటారు.

ఇక సింగిల్ ఉమన్ ఎందుకు సంతోషంగా ఉంటుందంటే.. భర్త పెట్టే టార్చర్ నుంచి దూరంగా ఉంటుంది. ముఖ్యంగా పితృస్వామ్య వ్యవస్థ ఏర్పాటు చేసిన సంప్రదాయాల వలలో చిక్కుకోకుండా స్వతంత్రంగా గడుపుతుంది. తనకు నచ్చినట్లుగా జాబ్, బిజినెస్ చేస్తూ ఇండిపెండెంట్ గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో బలమైన నెట్వర్క్ కలిగి ఉండి.. బలమైన నిర్ణయాలు తీసుకుంటూ సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. భాగస్వామితో రాజీపడకుండా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛను కలిగి ఉంటుంది. బలంగా, శక్తివంతంగా మారుతుంది, ఇది వారికి లోతైన సంతృప్తి, సాఫల్య భావాన్ని అందిస్తుంది. భర్త, పిల్లల కోసం తన సంతోషాన్ని త్యాగం చేసే అవసరం లేకుండా.. కెరీర్, వ్యక్తిగత అభివృద్ధిపై దృష్టి పెడుతూ.. డ్రీమ్స్ ఫుల్ ఫిల్ చేసుకుంటుంది. ముఖ్యంగా సింగిల్ ఉమెన్ గృహ బాధ్యతల నుంచి విముక్తి కలిగి ఉంటారు. వివాహిత స్త్రీతో పోలిస్తే అధిక స్థాయి సంతోషాన్ని పొందుతారని పలు అధ్యయనాలు కూడా వెల్లడించాయి.


Similar News