Health Benefits : కంటి చూపునకు వరం ఈ ఆకు కూర.. ఏడాదిలో 4 నెలలు మాత్రమే లభిస్తుంది..

మార్కెట్ కి వెళ్లామంటే అనేక రకాల ఆకుకూరలను చూస్తూ ఉంటాం. ఒక్కో ఆకు కూరలో అనేక పోషక విలువలు ఉంటాయి.

Update: 2024-08-31 09:35 GMT

దిశ, వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డెస్క్ : మార్కెట్ కి వెళ్లామంటే అనేక రకాల ఆకుకూరలను చూస్తూ ఉంటాం. ఒక్కో ఆకు కూరలో అనేక పోషక విలువలు ఉంటాయి. ఈ ఆకుకూరల్లో కొన్ని సంవత్సరం పొడవునా దొరికితే మరికొన్ని మాత్రం కొన్ని నెలలు మాత్రమే దొరుకుతాయి. అందులో ఒకలే చెంచలాకు. ఇది ఏడాదికి నాలుగు నెలలు మాత్రమే మార్కెట్‌లో లభిస్తుంది. ఈ గ్రీన్ వెజిటేబుల్ తినడానికి చాలా రుచిగా ఉంటుంది. అంతే కాదండోయ్ దీన్ని తిన్నారంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా లభిస్తాయి. ఎక్కువగా ఈ ఆకుకూర ఆగస్టు నెలలో చేన్లలో, పొలాల్లో పెరగడం మొదలై నవంబర్, డిసెంబర్ వరకు సాగు అవుతుంది.

చాలా మంది ఈ ఆకుకూరతో కూరతో పాటు చట్నీని కూడా చేస్తారు. అలాగే పూర్వం నుంచి ఈ ఆకులను ఆయుర్వేద వైద్యంలో కూడా ఔషధంగా వాడేవారంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు. ఇందులో మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం, ఐరన్, ఫాస్పరస్ లాంటి పోషకాలు అనేకం ఉన్నాయి. అందుకే దీన్ని ఎవరు తిన్నా ఆరోగ్యంగా ఉంటారంటున్నారు నిపుణులు.

ముఖ్యంగా ఈ ఆకుకూరను తినడం వలన కంటి చూపును మెరుగుపరుస్తుందట. ఇందులో ఉండే విటమిన్ ఏ ఎలాంటి కంటి సమస్యలు రాకుండా దోహదపడుతుంది. అలాగే ఇందులో ఉండే కాల్షియం ఎముకలను ధృఢంగా చేస్తుంది. అలాగే ఈ ఆకులను చర్మ సమస్యలకు హెర్బల్ మెడిసిన్ గా వినియోగిస్తారు. ఇందులో ఉండే ఫైబర్ మలబద్ధకాన్ని పారదోలుతుంది. ఈ ఆకుల కషాయం మూత్రపిండాల్లో ఉండే రాళ్లని కూడా కరగదీస్తుందంటున్నారు. శరీరంలో అధిక వేడిని తగ్గించటంలో ఉపయోగపడుతుంది.

గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహనకోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు. ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు తప్పకుండా నిపుణులను సంప్రదించగలరు.


Similar News