ఏడాదిగా బొమ్మతో డేటింగ్.. పెళ్లి, పిల్లలతో ఫ్యామిలీ సెటప్
దిశ, ఫీచర్స్ : ఒంటరి జీవితంతో విసిగిపోయిన ఒక వ్యక్తి రాగ్ డాల్(క్లాత్‌తో తయారుచేసిన బొమ్మ)తో డేటింగ్ ప్రారంభించాడు.
దిశ, ఫీచర్స్ : ఒంటరి జీవితంతో విసిగిపోయిన ఒక వ్యక్తి రాగ్ డాల్(క్లాత్‌తో తయారుచేసిన బొమ్మ)తో డేటింగ్ ప్రారంభించాడు. అంతేకాదు ఇప్పుడు అదే డాల్‌తో తన డ్రీమ్ వెడ్డింగ్‌కు సిద్ధమైన సదరు వ్యక్తి దానితోనే ఒక కుటుంబాన్ని మెయింటైన్ చేయాలనుకుంటున్నాడు. @montbk5959 పేరు గల తన టిక్ టాక్ హ్యాండిల్లో ఈ రాగ్‌డాల్‌తో తనకున్న అసాధారణ సంబంధాన్ని డాక్యుమెంట్ చేసిన అతను తనకు కాబోయే భార్య నటాలియా(రాగ్ డాల్)తో ప్రేమలో పడినట్లు తెలిపాడు.
ఈ జంట తమ రిలేషన్షిప్లో మొదటి వార్షికోత్సవాన్ని ఇటీవలే జరుపుకుంది. ఇక డాల్‌తో తన చేసే పనుల గురించి వివరించిన టిక్ టాకర్.. 'నా లిటిల్ గర్ల్‌తో కలిసి టీవీ చూడటమే కాక ప్రతి విషయం చర్చిస్తాను. ఇంకా ఆమెను ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పలేను. ఈ ఏడాదంతా తనతో గడిపాను. ప్రస్తుతం పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నాను' అని అతను ఒక వీడియో క్లిప్‌లో చెప్పాడు. అంతేకాదు భార్యగా చేసుకోవాలనుకుంటున్న ఈ రాగ్ డాల్ ఒక్కటే కాకుండా అతనికి రాగ్ డాల్ పిల్లలు కూడా ఉన్నారు. వారికి హోంవర్క్‌లో సాయపడటం, కలిసి ఆడుకోవడం వంటి సాధారణ తండ్రి విధులను కూడా నిర్వహిస్తున్నాడు. కానీ తన వీడియో పట్ల నెటిజన్లు నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు.