బార్ కోడ్ టాటూ వైరల్.. ఇక పేమెంట్స్‌కు ఫోన్ అక్కర్లేదు!
చేతిపై పేమెంట్ యాప్ బార్‌కోడ్‌ను శాశ్వతంగా టాటూ వేయించుకున్న తైవానీస్ వ్యక్తి సోషల్ మీడియా అటెన్షన్ క్యాచ్ చేశాడు. కొంతకాలంగా పచ్చబొట్టు వేయించుకోవాలనుకుంటున్న
దిశ, ఫీచర్స్: చేతిపై పేమెంట్ యాప్ బార్‌కోడ్‌ను శాశ్వతంగా టాటూ వేయించుకున్న తైవానీస్ వ్యక్తి సోషల్ మీడియా అటెన్షన్ క్యాచ్ చేశాడు. కొంతకాలంగా పచ్చబొట్టు వేయించుకోవాలనుకుంటున్న ఆయన.. కళాత్మక వస్తువులకు బదులుగా కొంచెం ప్రత్యేకంగా ఉండాలని కోరుకున్నాడు. ఈ క్రమంలోనే మార్కెట్‌లో వస్తువులను కొనేందుకు నిరంతరం స్మార్ట్ ఫోన్ బయటకు తీయడం ఇబ్బందిగా అనిపించడంతో.. ఈ సమస్య పరిష్కారానికి ఫంక్షనల్ టాటూను ఎందుకు వేయించుకోకూడదని అనుకున్నాడు. టాటూ ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్లి తన పేమెంట్ యాప్ బార్‌కోడ్‌ను ఇంక్ చేయాల్సిందిగా కోరాడు.
మొత్తానికి తైవానీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Dcardకు సంబంధించిన ఫంక్షనల్ బార్‌కోడ్ టాటూ వేయించుకున్న వ్యక్తి.. దీంతో ఫోన్‌తో పనితగ్గి ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నట్లు చెప్పాడు. ఇక ఈ పచ్చబొట్టుపై స్పందిస్తున్న నెటిజన్స్.. ఈ ఐడియాతో పాటు అంత పర్ఫెక్ట్‌గా టాటూ వేసిన ఆర్టిస్ట్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అసలు బార్ కోడ్‌తో కొంచెం డిఫరెన్స్ వచ్చినా అంటే.. బార్‌లలో ఒకదానిని మందంగా లేదా సన్నగా చేసినా, లేదంటే బార్‌కోడ్‌లో ఉన్న లైన్స్ కంటే కొంచెం వెడల్పుగా ఉన్నా ఉద్దేశించిన విధంగా పని చేయదు.
మొత్తానికి టాటూ ఆర్టిస్ట్ బ్యాంగ్-అప్ జాబ్ చేసాడు. ఎందుకంటే సదరు వ్యక్తి ముంజేయి పచ్చబొట్టును ఉపయోగించి కన్వీనియన్స్ స్టోర్లు, గ్యాస్ స్టేషన్లలో ఎటువంటి ఇబ్బంది లేకుండా పేమెంట్స్ చెల్లించాడు. పచ్చబొట్టు వర్క్ చేయడంతో ముందుగా తాను కూడా షాక్ అయినట్లు తెలిపిన ఆయన.. ప్రజలు కొన్నిసార్లు తనవైపు వింతగా, తదేకంగా చూస్తారన్నాడు. అయితే ఈ పచ్చబొట్టు చాలా మంది దృష్టిని ఆకర్షించినప్పటికీ.. తనను అనుసరించాలనుకునేవారు ఒకటికి రెండుసార్లు ఆలోచించమని సలహా ఇచ్చాడు. బార్‌కోడ్‌ను తప్పుగా పొందే అవకాశం ఉందని వివరించాడు. ఇక బార్‌కోడ్, క్యూఆర్ టాటూలు ప్రజలు తమ దైనందిన జీవితాన్ని సులభతరం చేయడానికి ఉపయోగించే రెండు మార్గాలు మాత్రమే. మరికొందరు అదే కారణంతో చర్మం కింద చిప్స్‌ని అమర్చుకుంటున్నారు.
READ MORE
ఇకపై గాయాలకు డ్రెసింగ్ అక్కర్లేదు.. 'SmartHEAL' డివైజ్‌తో పరిష్కారం