సిగరెట్ తాగిన వ్యక్తి నల్లబడిన ఊపిరితిత్తులు.. డేంజరస్ విజువల్స్ వైరల్

ఊపిరితిత్తులు అనేవి మానవ శరీరంలో ముఖ్యమైన భాగం.

Update: 2024-06-27 09:58 GMT

దిశ, ఫీచర్స్: ఊపిరితిత్తులు అనేవి మానవ శరీరంలో ముఖ్యమైన భాగం. ఇవి శ్వాస తీసుకోవడంలో ఉపయోగపడతాయి. లంగ్స్ పాడైతే మనిషి చనిపోతాడనే విషయం అందరికి తెలిసిందే. అయితే.. ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు ముఖ్యకారణం సిగరెట్. పొగాకు అలవాటు కారణంగా అనేక వ్యాధుల బారిన పడతారు. అందులో ముఖ్యమైనవి లంగ్ క్యాన్సర్. ఈ పొగాకు మహమ్మారి ప్రపంచ ప్రజారోగ్యాన్ని కుదిపేస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. WHO నివేదికల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా పొగాకు వినియోగం వల్ల సంవత్సరానికి 8 మిలియన్లకు పైగా ప్రజలు మరణిస్తున్నారు. నిత్యం సిగరెట్ తాగడం లేదా హానికరమైన రసాయనాలను పీల్చడంతో లంగ్స్ క్యాన్సర్ ఏర్పడుతుంది. ఇది శ్వాసనాళాల్లోని కణాల DNAకి జన్యుపరమైన నష్టం కలిగిస్తుంది.

దెబ్బతిన్న వాయుమార్గ కణాలు తనిఖీ చేయకుండా గుణించే సామర్థ్యాన్ని పొందుతాయి. దీని ద్వారా కణితులు ఊపిరితిత్తుల అంతటా వ్యాపించి.. వాటి పనితీరును దెబ్బతీస్తాయి. చివరికి ఊపిరితిత్తుల కణితులు మెటాస్టాసైజ్ అవుతాయి. ఇది శరీరంలోని ఇతర భాగాలకు కూడా వ్యాపించి ప్రాణ నష్టాన్ని మరింత దగ్గర చేస్తాయి. అయితే.. ఇలా పొగాకు తాగే వారి ఊపిరితిత్తులు నల్లగా మారిపోతాయని మనం విన్నాం. అవి ఎలా ఉంటాయని లైవ్‌లో చూపించారు కొందరు డాక్టర్లు. ఈ మేరకు ‘30 ఏళ్ల పాటు రోజుకు ఒక సిగరెట్ ప్యాకెట్ తాగిన 52 ఏళ్ల వ్యక్తి నల్లబడిన ఊపిరితిత్తులు’ అనే క్యాప్షన్ ఇచ్చిన షేర్ చేసిన ఈ వీడియోలో.. నల్లబడిన లంగ్స్ చూస్తే ఒళ్లు జలదరించడం ఖాయం. ప్రజెంట్ ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.


Similar News