బుగ్గలు, కను రెప్పల పై లిప్ స్టిక్స్‌తో బ్లష్ చేస్తున్నారా.. అయితే ఈ ప్రమాదాలు తప్పవు!

ఈ మధ్య మేకప్ అనేది ఒక వ్యాపారంగా నడుస్తోంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కాస్మటిక్స్ కి బాగా అలవాటు పడిపోయారు.

Update: 2024-03-06 07:40 GMT

దిశ, ఫీచర్స్ : ఈ మధ్య మేకప్ అనేది ఒక వ్యాపారంగా నడుస్తోంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కాస్మటిక్స్ కి బాగా అలవాటు పడిపోయారు. దీంతో మార్కెట్ లోకి తీరొక బ్రాండ్ దిగుతుంది. ఇక ఎంతలా రెడి అయినప్పటికి పెదలకు వేసే రంగుతోనే మెకప్ ఫుల్ ఫీల్ అయినట్టు. ఒకప్పుడు అమ్మాయిలు పెదవులు ఎర్రగా ఉంటే బాగుండు అని అనుకునే వారు. కానీ ఇప్పుడు వాటిలో కూడా రంగులు వచ్చేశాయి. మెరిసే, మాయిశ్చరైజింగ్, మిరుమిట్లు గొలిపే రంగులు వేసి పెదవులు అందంగా కనిపించేలా చేసుకుంటున్నారు. గోళ్ళ రంగులో ఎన్ని షేడ్స్ ఉంటున్నాయో లిప్ స్టిక్ లో కూడా అన్ని రకాల షేడ్స్ కనిపిస్తున్నాయి. అయితే, ఈ లిప్ స్టిక్స్‌ని కొందరు ఫేస్, బుగ్గలకు వాడేస్తున్నారు. దీని వల్ల అనారోగ్య సమస్యలున్నాయట. లిప్ స్టిక్ ను బ్లష్ లేదా ఐషాడోగా ఉపయోగించడం సరికాదు అంటున్నారు నిపుణులు.

మీరు మీ పెదవుల కోసం తయారు చేసినదాన్ని మీ ముఖం మీద ఇతర భాగాలపై ఉపయోగించకూడదు. అందుకోసం ఇతర ప్రొడక్ట్స్ ఉన్నాయి.ఇది మీ చర్మానికి మంచిది కాదని నిపుణులు. మన శరీరంలో ఒక్కో భాగం ఒక్కోలా ఉంటుంది. అతి సున్నితమైన ప్రధేశాలో మనం వాడే ఈ కాస్మటిక్స్ అలర్జీలకు గురిచేస్తాయి. క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే లిప్ స్టిక్స్ లు సాధారణంగా మైనాలు, నూనెలు, వర్ణద్రవ్యాలు, ఎమోలియెంట్ల కలయికతో తయారు చేస్తారు. మైనం, కాస్టర్, మినరల్ ఆయిల్ వంటి వివిధ నూనెలు, రంగులు.. షియా వెన్న లేదా లానోలిన్ వంటి పదార్ధాలు కలుపుతారు.. దీని మూలంగా ముఖం పాడయే ఛాన్స్ ఉంది.

అందుకే ఎంత మంచి బ్రాండ్ అయినప్పటికీ ఇతర భాగాలపై లిప్ స్టిక్ ఉపయోగించకూడదని నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా మన కనురెప్పలు శరీరంలో అత్యంత సన్నని చర్మాన్ని కలిగి ఉంటాయి. క్రమం తప్పకుండా అక్కడ లిప్ స్టిక్ ని వాడటం వల్ల కనురెప్పల చర్మశోథకు కారణమవుతాయి. అటోపిక్ చర్మశోథ ఉన్నవారిలో, ఈ పదార్థాలు బుగ్గలపై బ్లష్ చేసినప్పుడు చర్మ సంబంధ వ్యాధులు కూడా తలెత్తే ప్రమాదం ఉంది.

అంతే కాదు లిప్‌స్టిక్‌లో యూజ్ చేసే బిస్మత్ ఆక్సీ క్లోరైడ్ , పారాబెన్స్ వల్ల క్యాన్సర్ సోకే అవకాశం చాలా వరకు ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ రసాయనాల వల్ల బాడీలో ఉండే అవయవాలు దెబ్బతింటాయని హెచ్చరిస్తున్నారు. లిప్‌స్టిక్‌ ని రంగు రంగులుగా తయారు చేయడానికి మాంగనీస్, సీసం, కాడ్మియం వంటిని కలుపుతారు. ఇలాంటి రసాయనాలుండే లిప్ స్టిక్ వాడటం వల్ల కూడా అలర్జీ సమస్యలు వస్తాయంటున్నారు చర్మ సౌందర్య నిపుణులు పేర్కొంటున్నారు.

Read More..

ఆ మహిళ జలుబే కదా అనుకుంది.. చివరికి వికలాంగురాలిగా మిగిలింది..  


Similar News