నైట్ షిఫ్ట్స్‌తో హార్ట్ ఎటాక్, డిప్రెషన్

మానవ శరీరం జీవ గడియారాన్ని కలిగి ఉంటుంది.

Update: 2023-02-01 08:25 GMT

దిశ, ఫీచర్స్ : మానవ శరీరం జీవ గడియారాన్ని కలిగి ఉంటుంది. ఇది పగటిపూట మేల్కొలుపు, రాత్రిపూట నిద్రపోయేలా చేస్తుంది. అయితే ఇందుకు విరుద్ధంగా నైట్ షిఫ్టులలో వర్క్ చేయడం ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది. డిప్రెషన్, ఆందోళన కలిగే ప్రమాదం 25 నుంచి 40 శాతం ఎక్కువగా ఉండగా.. హార్మోన్ ఉత్పత్తిలో అసమతుల్యత సిర్కాడియన్ రిథమ్‌కు ఆటంకం కలిగిస్తూ నిద్రపై ప్రభావం చూపుతుంది. మానసిక స్థితిని దిగజారుస్తుంది. ఆందోళన, కోపం, నిరాశ, చిరాకుకు దారి తీస్తుంది.

అంతేకాదు రాత్రిపూట క్రమం తప్పకుండా మేల్కొని ఉండడం వల్ల గుండెపోటు, రక్తపోటు ప్రమాదంతో సహా హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో పనిచేయడం వల్ల అనేక స్వల్ప, దీర్ఘకాలిక పరిణామాలను కలిగి ఉంటుంది. రాత్రి షిఫ్ట్‌లలో అధిక ఒత్తిడి ప్రతిస్పందన ఉన్నందున రక్తపోటు, కార్డియాక్ అరెస్ట్‌, గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువ. తద్వారా కార్డియోలాజికల్ హెల్త్ తీవ్రంగా ప్రభావితమవుతుంది. షిఫ్ట్ వర్క్ వల్ల సామాజిక ఒంటరితనం, మూడ్ డిజార్డర్స్, అధిక నిద్ర, అలసట కూడా పెరుగుతుంది.

అలాగే రాత్రి షిఫ్టులలో పనిచేసే వ్యక్తులు శక్తితో కూడిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల.. ఆకలి హార్మోన్ 'గ్రెలిన్', సంతృప్తి హార్మోన్ 'లెప్టిన్' క్రమబద్ధీకరించబడటం లేదు. మెటబాలిక్ సిండ్రోమ్, స్థూలకాయం, మధుమేహం మొదలైన వాటికి దారితీస్తుంది. ఇవి క్యాన్సర్, గుండె జబ్బుల సంభావ్యతను మరింత పెంచుతాయి. సాధారణంగా పగటిపూట తినడం నైట్ వర్క్‌లో మానసిక స్థితి దుర్బలత్వాన్ని నివారిస్తుంది. కానీ పగటిపూట, రాత్రిపూట తినడం వల్ల నైట్ టైమ్‌లో ప్రేరేపించబడిన మానసిక స్థితి స్థాయిలు 26.2 శాతం పెరిగాయి. అంటే బేస్‌లైన్‌తో పోలిస్తే మానసిక స్థితి స్థాయిల ఆందోళన 16.1 శాతం పెరిగింది. పగటిపూట మాత్రమే తినే నైట్ షిఫ్ట్ ఎంప్లాయిస్‌లో నిస్పృహ, ఆత్రుత లక్షణాలలో ఈ పెరుగుదల గమనించబడలేదు.

ఎలా డీల్ చేయాలి?

* 30 మినిట్స్ న్యాప్ తీసుకోండి.

* మీ షిఫ్ట్ ప్రారంభమయ్యే ముందు, వీలైతే విరామ సమయంలో 10-20 నిమిషాలు నిద్రపోవడానికి ప్రయత్నించండి.

* స్మాల్ పోర్షన్స్ ఫుడ్ తీసుకోండి.

* కెఫిన్ తీసుకోవడం పరిమితం చేయండి.

* హైడ్రేటెడ్‌గా ఉండండి.

* బిజీగా ఉండండి.

* సహోద్యోగులతో మాట్లాడండి. ...

* ఫ్రీ టైమ్‌లో ఎనిమిది గంటలు నిద్రకు కేటాయించండి.

Tags:    

Similar News