Lifestyle : నీ గురించి.. నీకు ఏం తెలుసు ?

జ్ఞానం పెంచుకున్న మాత్రానా.. మనిషిలో అజ్ఞానం పూర్తిగా నశించిపోదు.

Update: 2022-12-17 04:38 GMT

దిశ, వెబ్ డెస్క్ : జ్ఞానం పెంచుకున్న మాత్రానా.. మనిషిలో అజ్ఞానం పూర్తిగా నశించిపోదు. ఈ ప్రపంచంలోని జ్ఞానంతా మన మెదడులో నింపి ఉంచుకోవాలి. మన హృదయపు లోతుల్లో కనిపించని మూలల్లో దాక్కొని ఉంటుంది. పైకి మాత్రం మనం మహా జ్ఞానులుగా కనిపిస్తుంటాం. ఓ చక్కటి జ్ఞానపు పూత పూసుకొని.. పైకి మాత్రం సర్వాలంకారా భూషితులుగానే కనిపిస్తుంటాం. కానీ లోపల అజ్ఞానం మాత్రం తిష్ట వేసుకొని ఉండిపోతుంది. మన అంతరంగంలో ఉన్న అజ్ఞానం అంతరించి పోయిన తర్వాత మాత్రమే.. నిజమైన జ్ఞానాన్ని సంభవిస్తుంది.అంత వరకు మన జ్ఞానమంతా అరువు తెచ్చుకున్న సమాచారమే. అబ్యాసించి సాధన చేస్తేనే.. అంతరంగంలోని అజ్ఞానం అంతరిస్తుంది. అర్జునుడు అసూయ లేని వాడు. చాలా విద్యలు తెలిసిన వాడు. గురు అనుగ్రహం కలిగిన వాడు. కురుక్షేత్ర సేనను చూడగానే అతడి లోపల అంతరించి పోనీ భయం, అజ్ఞానం విషాదం రూపంలో బయటకు వ్యక్తమాయాయ్యి. అతడి జ్ఞానీ కాదని అవి నిరూపించాయి. మన అంతః కరణను , ధ్యాసను సాధన ద్వారా ఎంతో పెంచుకోవాలి.  

Also Read...

వ్యాయామం చేయాలనే కోరికను ప్రేరేపించవచ్చు.. మార్గాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు 

Tags:    

Similar News