ఒక్క ఐడియాతో లైఫ్ చేంజ్!.. వాడి పడేసిన బట్టలతో లక్షలు సంపాదిస్తున్న మహిళ
‘ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది’ అనే మాట మనం అప్పుడప్పుడూ వింటుంటాం. కానీ కొందరు దానిని ఆచరణలో కూడా పెడుతుంటారు. సరికొత్త ఆలోచనలతో సక్సెస్ వైపు అడుగులేస్తుంటారు.
దిశ, ఫీచర్స్:‘ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది’ అనే మాట మనం అప్పుడప్పుడూ వింటుంటాం. కానీ కొందరు దానిని ఆచరణలో కూడా పెడుతుంటారు. సరికొత్త ఆలోచనలతో సక్సెస్ వైపు అడుగులేస్తుంటారు. అలాంటి వారిలో యూకేకు చెందిన హన్నా బెవింగ్టన్ ఒకరు. ఆమె ఎవరూ ఊహించని విధంగా వాడి పడేసిన బట్టలతో ఓ వ్యాపారాన్ని స్టార్ట్ చేసింది. ప్రస్తుతం లక్షల్లో సంపాదిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించగా నెట్టింట వైరల్ అవుతోంది. వివరాలేంటో చూద్దాం.
వాస్తవానికి హన్నా ఫేమస్ టిక్ టాక్ ఇన్ఫ్లుయెన్సర్. తరచుగా తన ఫాలోవర్స్‌తో బిజినెస్ టిప్స్ పంచుకుంటూ ఉంటుంది. తాజాగా తను వాడి పడేసిన దుస్తులతో ఆర్థికంగా ఎలా ఎదిగిందో వెల్లడించింది. కొంత కాలంగా హన్నా అప్పటికే వాడేసి, తనకు అవసరం లేదనుకునే దుస్తులను, బూట్లను నగలను ప్రముఖ ఆన్లైన్ మార్కెట్ స్పేస్ అయిన వింటెడ్ (Vinted) అమ్మకానికి పెడుతున్నట్లు తెలిపింది.
వింటెడ్ సైట్ ద్వారా ఎవరైనా సరే సెకండ్ హ్యాండ్ వస్తువులను సేల్ చేసే అవకాశం ఉందని హన్నా పేర్కొన్నది. కాకపోతే తాను దీనిని బాగా వాడుకున్నట్లు వెల్లడించింది. ఇప్పటి వరకు తను వాడి పడేసిన దుస్తులను అమ్మడం ద్వారా ఏకంగా రూ. 6, 44, 331 సంపాదించినట్లు తెలుపగా.. ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుందంటే ఇదేనేమో అంటున్నారు నెటిజన్లు.