బరువును తగ్గించే హార్మోన్.. దీన్ని ఎలా కంట్రోల్ చేయాలంటే...

ఆకలిని తగ్గించడంలో, శరీర బరువును నియంత్రించడంలో లెప్టిన్ హార్మోన్ ముఖ్య పాత్ర పోషిస్తుంది.

Update: 2024-01-22 12:21 GMT

దిశ, ఫీచర్స్ : ఆకలిని తగ్గించడంలో, శరీర బరువును నియంత్రించడంలో లెప్టిన్ హార్మోన్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ హార్మోన్ కొవ్వు కణాల ద్వారా ఉత్పత్తి అవుతుంది. శరీరంలో కొవ్వు ఎక్కువగా పెరిగినప్పుడు ఈ హార్మోన్ మెదడుకు కొన్ని సంకేతాలను పంపిస్తుంది. అప్పుడు ఆకలిని తగ్గించేందుకు సంపూర్ణత్వ అనుభూతిని కలిగిస్తుంది. లెఫ్టిన్ హార్మోన్ తక్కువగా ఉన్నవారు స్థూలకాయం సమస్యతో బాధపడే అవకాశం ఉంది. లెప్టిన్ హార్మోన్ తక్కువగా ఉత్పత్తి అయ్యే వారిలో ఎక్కువగా ఆకలి వేయడంతో వారు అతిగా తినాల్సి వస్తుంది.

లెఫ్టిన్ హార్మోన్ మెదడుకి సంకేతాలు పంపినప్పుడు మెదడులోలో ఉండే హైపోథాలమస్‌ మనిషి ఆకలిని, జీవక్రియను నియంత్రిస్తుంది. లెప్టిన్‌ను కొవ్వు కణాలు రక్తప్రవాహంలోకి విడుదల చేయడం ద్వారా అది మెదడుకు చేరుకుని హైపోథాలమస్‌లోని గ్రాహకాలను కలుస్తుంది. అప్పుడు శక్తి వ్యయాన్ని పెంచి, ఆకలిని తగ్గించు క్యాస్కేడ్‌ను ప్రేరేపిస్తుంది. అలాగే లెప్టిన్‌ బరువును కంట్రోల్ చేయడంలో ముఖ్యమైనపాత్ర పోషిస్తుంది. లెప్టిన్‌ రెసిస్టెన్స్‌ ఉన్నప్పుడు ఎనర్జీ హోమియోస్టాసిస్‌లో అసమతుల్యతలు ఏర్పడతాయి. అప్పుడు వెయిట్ ని సులువుగా కంట్రోల్ చేయలేం.

ఇక అప్పుడప్పుడు లెప్టిన్ సెన్సిటివిటీకి గురవుతుంది. లెప్టిన్ హార్మోన్ పై అనేక కారకాలు ప్రభావితం చూపిస్తాయి. లెప్టిన్‌ సిగ్నలింగ్‌ను అధిక బరువు, దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్‌, చెడు ఆహార అలవాట్లు దెబ్బతీస్తాయి. అంతే కాదు ఒత్తిడి, నిద్రలేమి, కొన్నిరకాల మెడిసిన్ వాడడం వలన లెప్టిన్‌ సెన్సిటివ్ గా మారుతుంది.

లెప్టిన్‌ హార్మోన్ ను బ్యాలెన్స్‌ చేయాలనుకుంటే మనం తీసుకునే ఆహారంలో ముందుగా శుద్ధి చేసిన పిండి పదార్థాలను, చక్కెర శాతాన్ని తగ్గించాలి. విటమిన్లు, ఫైబర్‌, ప్రొటీన్లు, మినరల్స్‌, ఆరోగ్యకరమైన కొవ్వు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే హై-ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్, నిత్యం వ్యాయామం, చేయడం ద్వారా లెప్టిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుంది.

Tags:    

Similar News