మీ జీవితం చెవులపైనే ఆధారపడి ఉంటుంది.. ఎలాగంటే..?

‘శరీరంలో ముఖ్యమైన భాగాల్లో చెవి(ear) ఒకటి.

Update: 2024-12-21 10:56 GMT

దిశ, వెబ్‌డెస్క్: ‘శరీరంలో ముఖ్యమైన భాగాల్లో చెవి(ear) ఒకటి. చెవి అనేది వెస్టిబ్యులర్ సిస్టమ్‌(Vestibular system)ని ఉపయోగించి వినికిడి, శరీర సమతుల్యతను ఎనేబుల్ చేసే అవయవం. క్షీరదాలలో, చెవి సాధారణంగా మూడు భాగాలను కలిగి ఉంటుంది. బయటి చెవి , మధ్య చెవి, లోపలి చెవి’. అయితే సావాస దోషమని పెద్దలు చెబుతుంటూ వినే ఉంటారు. మీరు ఎవరితోనైనా స్నేహం చేస్తే.. వారిలాగే మీరు తయారవుతారని దాని అర్థం.

కాగా పెద్దలు ఎప్పుడూ మంచివారితో ఫ్రెండ్షిఫ్ చేయాలని, చెడు అలవాట్లు ఉన్నవారితో స్నేహాలు మానేయాలని చెబుతారు. జీవితంలో పైకి రావాలంటే.. మిమ్మల్ని నిరంతరం ప్రోత్సహించే మిత్రులు మీ పక్కన ఉండాలి. కష్టసుఖాల్లో తోడుండాలి. మనకు కష్టమొస్తే వారి కష్టంలా భావించాలి. అలాంటి ఫ్రెండ్స్ కాకుండా జీవితంపై ఒక క్లారిటీ లేకుండా.. కష్టం విలువ తెలియనివారితో స్నేహం చేస్తే మీరు కూడా వారిలాగే తయారు అవుతారు.

మీరు మార్నింగ్ లేచాక ఏదైనా సాంగ్ విన్నారనుకోండి.. నైట్ పడుకునే వరకు కూడా ఆ పాట మీ మైండ్‌లో నిక్షిప్తమైపోతుంది. ఇలాగే మీ పక్కన ఉన్నవారు చెడు మాటలు మాట్లాడిన, చెడు ఆలోచనలు చేసినా.. మీరు వారిలాగే మాట్లాడుతారు. చెడు దారిలో పోవడానికి ప్రయత్నిస్తారు. కానీ ఓ పాజిటివ్ పర్సన్‌తో స్నేహం చేస్తే.. వారి ఆలోచనలు, మాటలు వింటుంటే మీరు చక్కగా ఆలోచిస్తారు. మీ మంచి మంచి ఆలోచనలు తల్లిదండ్రుల వద్ద కూడా గౌరవాన్ని ఇస్తాయి.

కాగా లైఫ్‌లో మీ లక్ష్యమేంటో కేవలం దాని గురించే ఆలోచించడం మంచిది. మీ ఫ్రెండ్స్‌తో దానికి సంబంధించిన విషయాలే చర్చించండి. దీంతో మీరు జీవితంలో సక్సెస్(Success) అవుతారు. కాగా లేవగానే బుక్స్ చదవండి. చెవులకు ఆహ్లాదాన్ని ఇచ్చే సాంగ్స్ వినండి. మిమ్మల్ని తరచూ ప్రోత్సహించే వ్యక్తులతో ఉదయం పూట కాసేపు ముచ్చటించండి. ఎవ్వరి జీవితమైన ఇలాగే 90 శాతం చెవుల మీదే ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.


Similar News