Ladyfinger: పచ్చి బెండకాయలు తినేవారు వీటి గురించి తప్పక తెలుసుకోవాలి!
మనలో కొందరు పచ్చి కూరగాయలను తినేస్తుంటారు
దిశ, వెబ్ డెస్క్ : మనలో కొందరు పచ్చి కూరగాయలను తినేస్తుంటారు. వాటిలో ఎక్కువగా పచ్చి బెండకాయలను ( Ladyfinger) తింటుంటారు. వీటిని తినడం వల్ల మన ఆరోగ్యానికి ( Health ) ఎన్నో ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే, పచ్చి బెండకాయలను తినే వారు ఈ విషయాల గురించి తప్పక తెలుసుకోవాలి.
లేడీ ఫింగర్స్ లో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ , యాంటీఆక్సిడెంట్లతో, విటమిన్ సి ఉంటాయి. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు వారంలో రెండు సార్లు తింటే ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. దీనిని తినడం వలన మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు గురించి ఇక్కడ తెలుసుకుందాం..
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: బెండకాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది.ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో కీలక పాత్ర వహిస్తుంది. అంతేకాకుండా, మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది. బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ను కూడా నియంత్రిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారికి ఇది బాగా పని చేస్తుంది.
గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది: ఇది కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గించడంలో సహాయపడుతుంది, గుండె సమస్యలకు చెక్ పెడుతుంది.
బరువు తగ్గడానికి సహాయపడుతుంది: బెండకాయలాలో కేలరీలు తక్కువగా ఉండటం వలన బరువు సులభంగా తగ్గుతారు. అంతేకాకుండా దీనిలో ఉండే ఫైబర్ కడుపు నిండిన భావనను కలిగిస్తుంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘దిశ’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.