Smartphones Kids: పిల్లలు.. ఏ ఏజ్‌లో ఎంతసేపు మొబైల్ వాడాలి..?
ఈ మధ్యకాలంలో పిల్లలు ఫోన్ ఏ రేంజ్‌లో ఉపయోగిస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.
దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్యకాలంలో పిల్లలు ఫోన్ ఏ రేంజ్‌లో ఉపయోగిస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. గంటల తరబడి ఫోన్‌లోనే మునిగితేలుతున్నారు. తిండి లేకుండా అయినా ఉంటున్నారు కానీ.. ఫోన్ ఒక్క నిమిషం పక్కన ఫోన్ లేకపోతే శ్వాస పీల్చుకోలేకపోతున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు అయితే మరీ ఎక్కువ. గేమ్స్ ఆడడం, వీడియోలు చూడడం.. అన్నం తినడం లేదని పేరెంట్స్ పిల్లలకు స్మార్ట్ ఫోన్లు ఇచ్చి.. వీడియోలు చూపించడం.. ఇలా పిల్లలు కూడా ఫోన్లకు బానిసవుతున్నారు. దీంతో పిల్ల మానసికంగా, ఆరోగ్యపరంగానూ పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాగా పిల్లలు ఎంత సేపు ఫోన్ చూడాలి? ఏ వయసును బట్టి ఎంత టైమ్ వరకు చూడాలనేది ఇప్పుడు చూద్దాం..
2 సంవత్సరాల వయసులో పిల్లలకు మొబైల్ అస్సలు ఇవ్వకూడదు. రెండు ఏళ్లు గడిచిన పిల్లలకు అంటే.. 2 నుంచి 3 ఏళ్ల వారికి ఒక గంట పాటు ఫోన్ చూసేందుకు అనుమతి ఇవ్వచ్చు. ఇక 8 నుంచి 18 సంవత్సరాల పిల్లలకు రోజుకు ఒక రెండు గంటల పాటు ఫోన్ ఇవ్వండి. కానీ పిల్లలు ఫోన్ లో ఏం చూస్తున్నారు.. ఎందుకు ఫోన్ వాడుతున్నారో నిరంతరం గమనిస్తూ ఉండాలి. గేమ్‍లు, వీడియోలు చూసేందుకు అతిగా అలవాటు పడకుండా పెద్దలు జాగ్రత్త పడాలి.
ఫోన్ ఎక్కువగా వాడితే.. శారీరకంగా, మానసికంగా ప్రభావం పడే అవకాశం ఉంటుంది. స్క్రీన్ ఎక్కువ సమయం పాటు చూస్తే కంటి చూపు మందగిస్తుంది. తలనొప్పి వస్తుంది. వీటితో పాటు కళ్ల నొప్పి, మెలటోనిక్ ఉత్పత్తి తగ్గి.. నిద్రపై కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. అలాగే పిల్లలు ఎక్కువసేపు ఫోన్ చూస్తే ఇతరలతో కలవలేరు. దీంతో కమ్యూనికేషన్ దెబ్బతింటుంది. ఫోన్ పట్టుకుని ఒకే దగ్గర కూర్చోవడం వల్ల శారీరక శ్రమ తగ్గుతుంది. కాగా పిల్లలు ఫిట్‌గా ఉండరు. దీంతో ఫ్యూచర్‌లో ఊబకాయం వంటి సమస్యలు తలెత్తుతాయి.
ఫోన్‌లో మునిగితేలడం వల్ల కొంతకాలం తర్వాత ఒంటరితనంగా ఫీల్ అయి.. డిప్రెషన్‌కు లోనవుతారు. మానసిక ఆరోగ్యం నశించిపోతుంది. కొన్ని రకాల కంటెంట్ పిల్లల మనసుపై, తమ హ్యాబిట్స్ పై ఎఫెక్ట్ చూపుతుంది. అంతేకాకుండా ముఖ్యంగ మెమోరీ లాస్ అవుతుంది. కాగా పిల్లలు ఫోన్ ఎక్కువగా వాడకుండా చూసుకునే బాధ్యత తల్లిదండ్రులదేనంటున్నారు నిపుణులు.
గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.