స్నేక్ ఫ్రూట్ ఉందని తెలుసా..? అసలు దాని ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు!

స్నేక్ ఫ్రూట్.. దీనికి సలాక్ అని కూడా అంటారు. ఇది ఆగ్నేయ ఆసియా పండు.

Update: 2024-06-18 15:24 GMT

దిశ, ఫీచర్స్: స్నేక్ ఫ్రూట్.. దీనికి సలాక్ అని కూడా అంటారు. ఇది ఆగ్నేయ ఆసియా పండు. ఇందులో విటమిన్ సి, పొటాషియం, ఫైబర్‌ వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇది సలాక్ బలి, సలాక్ పాండోహ్, సలాక్ బలి మేరా వంటి రకాలతో ప్రత్యేకమైన రూపాన్ని కలిగి ఉండటమే కాకుండా.. మంచి రుచికి ప్రసిద్ధి చెందింది. అంతే కాకుండా.. ప్రపంచంలోనే వింతైన పండు ఇది. అలాగే.. దీనిపైన తొక్క స్నేక్ స్కిన్ టైప్‌లో ఉంటుంది. అందుకే ఈ ఫ్రూట్‌ని స్నేక్ ఫ్రూట్ అని పిలుస్తారు. ఇండోనేషియాలో ఎక్కువగా ఈ స్నేక్ ఫ్రూట్ దొరుకుతుంది. కాలక్రమేణా దీని సాగు థాయిలాండ్, మలేషియా, ఫిలిప్పీన్స్ సహా ఇతర ఉష్ణమండల ప్రాంతాలకు వ్యాపించింది. అక్కడి వారు దీనిని ఇష్టంగా తింటారు. అయితే.. దీని వల్ల కలిగే హెల్త్ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

* జ్ఞాపకశక్తి పండు అని కూడా దీనిని పిలుస్తారు. సలాక్‌లో ఉండే పెక్టిన్, పొటాషియం జ్ఞాపకశక్తి పనితీరును పెంచుతాయి. అందుకే దీనిని జ్ఞాపకశక్తి పండు అని కూడా పిలుస్తారు.

* సలాక్ బీటా- కెరోటిన్ కంటి సంబంధిత రుగ్మతలను నివారించడానికి ఒక ముఖ్యమైన పోషకంగా ఉపయోగపడుతుంది.

* ఈ పండులో టానిన్లు, సపోనిన్లు, ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. ఇవి విరేచనాలను నిరోధించే లక్షణాలను కలిగి ఉంటాయి. విరేచనాల చికిత్సలో సహాయపడతాయి. జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి. దీర్ఘకాలిక కడుపు సమస్యలను కూడా నివారిస్తుంది.

* యాపిల్, పైనాపిల్ వంటి ఫ్రూట్స్‌తో పోలిస్తే సలాక్ పండు మరింత రుచిని కలిగి ఉంటుంది. అలాగే ఇందులో ఉండే పోషకాలు ఆరోగ్యాన్ని ఇస్తాయి.

* సలాక్ ఫ్యూట్‌ని పోషకాల పవర్ హౌజ్‌గా పిలుస్తారు. ఇందులో విటమిన్ సి, పొటాషియం, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.

Similar News