గ్యాస్ సిలిండర్ EXPIRY DATE గురించి తెలుసా?

ఒకప్పటి కాలంలో కట్టెల పొయ్యిమీద వంటలు వండేవారు.

Update: 2023-04-23 10:47 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఒకప్పటి కాలంలో కట్టెల పొయ్యిమీద వంటలు వండేవారు. తరువాత కొద్ది రోజులకు కరెంటుతో నడిచే హీటర్లు, కిరోసిన్ స్టవ్‌లు అందుబాటులో వచ్చాయి. వాటితో పాటే గ్యాస్ సిలిండర్‌లు కూడా అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుత కాలంలో గ్యాస్ సిలిండర్ ప్రతి ఒక్కరి ఇంట్లో నిత్యావసరంగా ఉంది. అయితే చాలా మందికి నిత్యం మనం వాడే వంట గ్యాస్ సిలిండర్ నిర్వహణ, సిలిండర్‌‌కు సంబంధించిన చాలా విషయాలు తెలియవు. ముఖ్యంగా సిలిండర్ ఎక్స్ పయిరీ గురించి. మనం షాపుల్లో తీసుకునే నిత్యావసరాలకు ఎలాగయితే ఎక్స్ పయిరీ ఉంటుందో సిలిండర్‌కు కూడా ఎక్స్ పయిరీ డేట్ ఉంటుంది. కానీ ఈ విషయం చాలా మందికి తెలియదు. మరి సిలిండర్ ఎక్స్ పయిరీ డేట్ ను ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇంటికి గ్యాస్ రాగానే సిలిండర్‌ను తీసుకుని పక్కన పెట్టేస్తూ ఉంటాం. ఎప్పుడైనా సిలిండర్‌ని తీసుకున్నప్పుడు దానిపై ఉన్న మెటల్ ప్లేట్లలో ఒకదానిపై లోపలివైపు ఎక్స్ పయిరీ రాసి ఉంటాయి. అలాగంటే సిలిండర్ పై A 22 అని ఉందను కోండి 2022వ సంవత్సరం జనవరి నుంచి మార్చి వరకు డేట్ ఉందని అర్థం. అలాగే B అక్షరం ఉంటే ఏప్రిల్ నుంచి జూన్, C అక్షరం ఉంటే జూలై నుంచి సెప్టెంబర్, D అక్షరం ఉంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు అని అర్థం అన్నమాట. అయితే మన ఇంట్లో ఉన్నప్పుడు లేదా సిలిండర్‌ను తీసుకున్నప్పుడు ఎక్స్ పయిరీ అయ్యితే సిలిండర్లలో లీకేజీలు ఏర్పడవచ్చు. దీకి కారణంగా ఎంత పెద్ద ప్రమాదాలు అయినా జరగవచ్చు. అంతే కాదు సిలిండర్ తీసుకునేటప్పుడు పైన సీల్‌ను చెక్ చేసుకోవాలి. క్యాప్ తెరచి లీకేజీ ఉందేమో పరీక్షించాలి.ఇప్పటి నుంచి సిలిండర్ తీసుకునేప్పుడు ఈ జాగ్రత్తలు మాత్రం మరవకండి.

Tags:    

Similar News