Kiara Advani : కియారా అద్వానీ బర్త్ డే స్పెషల్.. ‘గేమ్ ఛేంజర్’ నుంచి సరికొత్త పోస్టర్ రిలీజ్

మెగా పవర్ పవర్‌ స్టార్ రామ్ చరణ్, అందాల భామ కియారా అద్వానీ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్. శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు.

Update: 2024-07-31 06:07 GMT

దిశ, సినిమా: మెగా పవర్ పవర్‌ స్టార్ రామ్ చరణ్, అందాల భామ కియారా అద్వానీ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్. శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక సినిమా కోసం అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తుండగా, ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తయింది. ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది డిసెంబర్ 20న రిలీజ్ చేయనున్నట్లు ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇప్పటికే అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.

ఇకపోతే నేడు(జులై 31) కియారా అద్వానీ బర్త్ డే. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ‘గేమ్ ఛేంజర్’ మూవీ టీమ్ ఆమెకు విష్ చేస్తూ.. సరికొత్త సర్‌ ప్రైజ్‌గా మూవీ నుంచి ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. ప్రజెంట్ ఇది నెట్టింట వైరల్ అవుతుండగా, అభిమానులు క్యూరియాసిటీతో రియాక్ట్ అవుతూ కియారాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా ఈ సినిమాలో కియారా ‘జాబిలమ్మ’ రోల్ పోషిస్తుండగా, అంజలీ, ఎస్.జె సూర్య, శ్రీకాంత్, జయరాం, సునీల్, సముద్ర ఖనీ వంటి నటీ నటులు కీలకపాత్రల్లో కనిపించనున్నారు.

Tags:    

Similar News