ప్రేమ పక్షుల పేరెంట్స్‌కు హైకోర్టు షాక్.. పారిపోయి పెళ్లిచేసుకోవడంపై..

దిశ, ఫీచర్స్ : పారిపోయి వివాహం చేసుకున్న ఓ ప్రేమ జంటకు కర్ణాటక హైకోర్టు అనుకూలంగా తీర్పునిచ్చింది..Latest Telugu News

Update: 2022-06-15 07:53 GMT

దిశ, ఫీచర్స్ : పారిపోయి వివాహం చేసుకున్న ఓ ప్రేమ జంటకు కర్ణాటక హైకోర్టు అనుకూలంగా తీర్పునిచ్చింది. మే 13న గుడిలో పెళ్లి చేసుకున్న వీరిద్దరూ అప్పటి నుంచి సహజీవనం చేస్తున్నారు. అయితే ఇంజినీరింగ్ విద్యార్థిని నిసర్గ కాలేజీ హాస్టల్ నుంచి తప్పిపోయిందని, నిఖిల్ అనే డ్రైవర్ ఆమెను బలవంతంగా తీసుకెళ్లాడంటూ ఆమె తండ్రి టీఎల్ నాగరాజు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాడు.

దీంతో జస్టిస్ బి వీరప్ప, జస్టిస్ కెఎస్ హేమలేఖ డివిజన్ బెంచ్ ముందు వారిద్దరినీ హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో కోర్టు ముందుకు వచ్చిన నిసర్గ.. వయసు రీత్యా తాను మేజర్‌నని, భర్త నిఖిల్‌తో కలిసి జీవించాలనుకుంటున్నానని చెప్పింది. అంతేకాదు తల్లిదండ్రుల వద్దకు తిరిగి వెళ్లడం తనకు ఇష్టం లేదని, తన ఇష్టానుసారమే పెళ్లి చేసుకున్నానని పేర్కొంది.

కాగా ఇరువురి స్టేట్‌మెంట్స్‌ను పరిగణలోకి తీసుకున్న కోర్టు.. తండ్రి పిటిషన్‌ను కొట్టివేస్తూ షాక్ ఇచ్చింది. 'తల్లిదండ్రులు సహా ఎవరికీ మరొకరికి భాగస్వాములను సెలెక్ట్ చేయడంలో ఎటువంటి హక్కు ఉండదని తెలిపింది. జీవితానికి సంబంధించిన కీలక విషయాలపై నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఆ వ్యక్తికి మాత్రమే ఉంటుందని వెల్లడించింది. 


Similar News