జిమ్‌లో ఈ మిస్టేక్స్ మాత్రం చేయకండి.. తర్వాత బాధపడాల్సి వస్తుంది!

ఈరోజుల్లో ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ప్రతి ఒక్కరిలో ఇంట్రెస్ట్ పెరుగుతోంది. అందుకోసం యువతీ, యువకులు జిమ్‌ సెంటర్లకు వెళ్తుంటారు. అయితే అక్కడ వర్కవుట్స్ సందర్భంగా చేసే కొన్ని పొరపాట్లు ఆరోగ్యానికి హానికరం కావచ్చు.

Update: 2024-05-30 12:53 GMT

దిశ, ఫీచర్స్ :  ఈరోజుల్లో ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ప్రతి ఒక్కరిలో ఇంట్రెస్ట్ పెరుగుతోంది. అందుకోసం యువతీ, యువకులు జిమ్‌ సెంటర్లకు వెళ్తుంటారు. అయితే అక్కడ వర్కవుట్స్ సందర్భంగా చేసే కొన్ని పొరపాట్లు ఆరోగ్యానికి హానికరం కావచ్చు. కాబట్టి ఏం చేయాలి? ఏం చేయకూడదో తెలుసుకుందాం.

* కొందరు జిమ్‌కి వెళ్లగానే హైలెవల్ వర్కవుట్ స్టార్ట్ చేస్తారు. కానీ ఇది కరెక్ట్ కాదట. నేరుగా ప్రారంభించే వ్యాయామంవల్ల శరీరంలో అంతర్గత సమస్యలు, తిమ్మిరి వచ్చే రిస్క్ ఎక్కువ. కాబట్టి ముందు చిన్నగా ప్రారంభించండి. శరీరం కాస్త సర్దుకున్నాక ఎక్కువ వ్యాయామాలను ట్రై చేయవచ్చు.

*వర్కవుట్స్‌లో శరీర భంగిమలపై కొందరు నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇది కండరాలకు హాని చేస్తుంది. కాళ్లు, చేతులు, శరీరం తప్పుడు భంగిమలో ఉన్నప్పుడు మీ శరీరం మొత్తంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కాబట్టి ట్రైనర్ సహాయంతో ఏ వర్కవుట్ ఎలా చేయాలో ముందుగా నేర్చుకొని చేయడం మంచిది.


* బాడీ బిల్డింగ్ కోసమని స్థాయికి మించిన కసరత్తు చేయడానికి ప్రయత్నించవద్దు. ఒకేసారి భారీ డంబెల్స్ ఎత్తాలని ట్రై చేయవద్దు. ఈ తొండరపాటు కీళ్లు, ఎముకల్లో గాయాలకు, బాడీ పెయిన్స్‌కు కారణం కావచ్చు. కాబట్టి మీ శరీర సామర్థ్యాన్ని బట్టి ఏది అవసరమో అదే చేయండి. చిన్న చిన్న బరువులు ఎత్తడం ప్రారంభించి అధిక బరువులు ఎత్తడానికి ట్రై చేస్తే సక్సెస్ అవుతారు. ఫిజికల్ యాక్టివిటీస్ లేకపోవడం ఎంత నష్టమో, అతి వ్యాయామాలు కూడా అంతే హానికరం. 


Similar News