వృద్ధాప్య ఛాయలను దూరంగా ఉంచుతున్న ప్రయాణాలు.. ఈ టిప్స్ పాటిస్తే యవ్వనం మీ సొంతం..

ఆస్ట్రేలియాలోని ఎడిత్ కోవాన్ విశ్వవిద్యాలయ అధ్యయనం వృద్ధాప్యాన్ని శరీరంలో పెరుగుతున్న రుగ్మతగా పేర్కొంది. కొత్త అనుభవాలను పరిచయం చేయడం, సామాజిక ప

Update: 2024-10-15 16:38 GMT

దిశ, ఫీచర్స్ : ఆస్ట్రేలియాలోని ఎడిత్ కోవాన్ విశ్వవిద్యాలయ అధ్యయనం వృద్ధాప్యాన్ని శరీరంలో పెరుగుతున్న రుగ్మతగా పేర్కొంది. కొత్త అనుభవాలను పరిచయం చేయడం, సామాజిక పరస్పర చర్యలను ప్రోత్సహించడం, స్థిరమైన శారీరక శ్రమలో పాల్గొనడంతోపాటు ముఖ్యంగా ప్రయాణం వాస్తవానికి ఈ వృధ్యాప్య ఛాయలను తగ్గిస్తుందని తెలిపింది. ఇంతకీ జర్నీ శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఏ విధంగా యాంటీ ఏజింగ్ కు హెల్ప్ చేస్తుంది? ఆరోగ్యకరమైన, యవ్వన జీవనశైలికి ఏ విధంగా సాయపడుతుంది? తెలుసుకుందాం.

ప్రయాణం ప్రయోజనాలు

ఒత్తిడి తగ్గింపు: అడవులు లేదా బీచ్‌లు వంటి కొత్త వాతావరణాల్లో ఎంజాయ్ చేయడం వల్ల ఒత్తిడి స్థాయిలు గణనీయంగా తగ్గుతాయి.

శారీరక దృఢత్వం: ట్రావెలింగ్ తరచుగా వాకింగ్, హైకింగ్, సైక్లింగ్‌ను కలిగి ఉంటుంది. ఇది హృదయ ఆరోగ్యాన్ని, కండరాల బలాన్ని, మొత్తం శ్రేయస్సును మెరుగుపరుస్తుంది.

సామాజిక పరస్పర చర్య: కొత్త వ్యక్తులను కలుసుకోవడం, స్థానికులు, తోటి ప్రయాణికులతో మాట్లాడటం.. మానసిక స్థితిని మెరుగుపరచవచ్చు, ఒంటరితనం భావాలను తగ్గించవచ్చు. అభిజ్ఞా పనితీరును ఇంక్రీజ్ చేయవచ్చు.

ఆరోగ్యకరమైన ఆహారం: కొత్త, తాజా, స్థానిక ఆహారాలను అన్వేషించడానికి, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రోత్సహించడానికి ప్రయాణం హెల్ప్ చేస్తుంది.

వెల్నెస్, రిలాక్సేషన్: అనేక ప్రయాణ గమ్యస్థానాలలో కనిపించే వెల్నెస్ సెంటర్లు, బహిరంగ ప్రదేశాలు శారీరక, మానసిక శ్రేయస్సుకు తోడ్పడతాయి.

పునరుజ్జీవనం కోసం చిట్కాలు..

  • యూనిక్ యాక్టివిటీస్ లో ట్రై చేయండి. వాటిలో పూర్తిగా నిమగ్నమై ఆస్వాదించండి.
  • స్థానికులతో వారి సంస్కృతీ సంప్రదాయాల ప్రాముఖ్యత గురించి మాట్లాడండి. వాటిని ట్రై చేసేందుకు ప్రయత్నిస్తూ ఆనందించండి.
  • జర్నీలో ఫిజికల్ యాక్టివిటీస్ ఉండేలా చూసుకోండి. ఇలాంటి ప్లాన్ హెల్తీగా ఉంచుతుంది.
  • ఆరోగ్యకరమైన లోకల్ ఫుడ్స్ తీసుకోండి. శరీరానికి పోషకాలను అందించండి.
  • డిజిటల్ వరల్డ్ (ఫోన్,ల్యాప్ టాప్, సోషల్ మీడియా) నుంచి డిస్ కనెక్ట్ అయ్యి..ప్రజెంట్ మూమెంట్ ఎంజాయ్ చేయండి.
Tags:    

Similar News