కన్వీనియన్స్ స్టోర్‌లో 'రోబో' సేవలు!

దిశ, ఫీచర్స్: ఇండియా నుంచి అమెరికా వరకు ‘లేబర్స్’ దొరకడం చాలా కష్టంగా మారిన విషయం తెలిసిందే.Latest Telugu News

Update: 2022-08-21 08:30 GMT

దిశ, ఫీచర్స్: ఇండియా నుంచి అమెరికా వరకు 'లేబర్స్' దొరకడం చాలా కష్టంగా మారిన విషయం తెలిసిందే. కుచించుకుపోతున్న శ్రామికశక్తిని ఎదుర్కోనేందుకు జపాన్‌లోని అతిపెద్ద కన్వీనియన్స్ స్టోర్ చైన్ 'ఫ్యామిలీ మార్ట్' ఓ వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చింది. ఈ మేరకు స్టోర్‌లోని అల్మారాల్లో రీస్టాక్ చేసేందుకు AI-పవర్డ్ రోబోలను ఉపయోగించడం ప్రారంభించింది.

జపాన్‌లో శ్రామికశక్తి క్షీణించడంతో వ్యాపారస్తులు ఆందోళనపడుతున్నారు. దీంతో ఈ సమస్యను పరిష్కరించుకునేందుకు గానూ ఇప్పటికే మార్గాలను అన్వేషిస్తుండగా, కొన్ని కంపెనీలు మాత్రం మానవ కార్మికులను భర్తీ చేయడంలో ముందున్నాయి. కానీ ప్రముఖ కన్వీనియన్స్ స్టోర్ చైన్ 'ఫ్యామిలీ మార్ట్' దేశవ్యాప్తంగా ఉన్న తమ స్టోర్‌లలో AI- పవర్డ్ TX SCARA అని పిలిచే రోబోలను నియమించగా, ఇందుకోసం టోక్యోకు చెందిన రోబోటిక్స్ కంపెనీ టెలెక్సిస్టెన్స్‌తో జట్టుకట్టింది. ఈ కొత్త ఉద్యోగులు రిఫ్రిజిరేటర్లలో కూల్‌డ్రింక్స్‌ను సర్దుబాటు చేయడం, షెల్ఫ్‌లోని వస్తువులను అకామడేట్ చేయడం వంటి బాధ్యతను కలిగి ఉంటాయి.

కొత్త షెల్ఫ్-స్టాకింగ్ రోబోలు 98% మానవ సాయం లేకుండా పని చేయగలవు. ఇక మిగిలిన 2 శాతం కూడా.. వర్చువల్ రియాలిటీ హెడ్‌సెట్స్ ఉపయోగించి మనం వాటిని రిమోట్‌గా నియంత్రించవచ్చు. రోబోల పని, వాటి నిర్వహణ కోసం టెలెక్సిస్టెన్స్ నెలవారీ రుసుమును అందుకుంటుంది. తొలిగా 300 ఫ్యామిలీ మార్ట్ స్టోర్‌లలో మాత్రమే వీటిని వినియోగిస్తుండగా.. ఆశించిన ప్రయోజనముంటే కంపెనీకి సంబంధించిన మిగతా 16,000 జపనీస్ స్టోర్‌లలో కూడా వాటిని నియమించుకోనుంది.

Tags:    

Similar News