Beauty trends : వాళ్లు అందుకే అంత స్లిమ్‌గా ఉంటారు.. జపనీస్ బ్యూటీ ట్రెండ్స్ వెనుక అసలు రహస్యమిదే..
ఈ మధ్య యువతలో రకరకాల బ్యూటీ ట్రెండ్స్‌పై ఆసక్తి పెరుగుతోంది. అధిక బరువు తగ్గడానికి, అందంగా కనిపించడానికి ఏం చేయాలనే అంశాలపై పలువురు ఫోకస్ పెడుతున్నారు.
దిశ, ఫీచర్స్ : ఈ మధ్య యువతలో రకరకాల బ్యూటీ ట్రెండ్స్‌పై ఆసక్తి పెరుగుతోంది. అధిక బరువు తగ్గడానికి, అందంగా కనిపించడానికి ఏం చేయాలనే అంశాలపై పలువురు ఫోకస్ పెడుతున్నారు. ఫిట్‌నెస్ విషయంలో కొంతకాలం కొరియన్ బ్యూటీ ట్రెండ్స్ పలువురిని ఆకట్టుకోగా, ఇటీవల జపాన్ బ్యూటీ ట్రండ్స్ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా జపాన్ ప్రజలు ఎందుకంత స్లిమ్‌గా ఉంటారు? అధిక బరువు సమస్య ఎదుర్కోకపోవడానికి కారణాలు ఏమిటి? అనే విషయాలపై సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తోంది. నిపుణుల ప్రకారం అందుకు గల కారణాలేమిటో పరిశీలిద్దాం.
ఒబేసిటీ చాలా తక్కువ
వాస్తవానికి అధిక బరువు, అనారోగ్యాలు మనం తీసుకునే ఆహారపు అలవాట్లతో కూడా ముడిపడి ఉంటాయి. మన దేశంతోపాటు కొన్ని వెస్ట్రన్ కంట్రీస్‌లో ఈ సమస్య పెరగడానికి ప్రధాన కారణం తీసుకునే ఆహారాలు, ఫిజికల్ యాక్టివిటీస్ లేకపోవడం అని నిపుణులు చెప్తున్నారు. కానీ జపాన్‌లో మాత్రం అలా కాదట. వాళ్లు ఆరోగ్య కరమైన ఆహార నియమాలు తప్పక పాటిస్తారని, అందుకే స్లిమ్‌గా ఉంటారని నిపుణులు చెప్తున్నారు. పైగా జపాన్‌లో అధిక బరువు, ఊబకాయం వంటి సమస్యలు చాలా తక్కువగా ఉంటున్నాయి. ప్రపంచ దేశాలతో పోల్చితే కేవలం 4 శాతం మంది మాత్రమే ఒబేసిటీ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నట్లు అధ్యయనాలు పేర్కొంటున్నాయి.
ఫాస్ట్ ఫుడ్‌కు దూరంగా..
జపాన్ ప్రజలు బయట లభించే ఫాస్ట్‌ఫుడ్ తీసుకోడానికి అస్సలు ఇష్టపడరు. అలాగని ఇక్కడ కేఎఫ్‌సీ, మెక్‌డొనాల్డ్ వంటిఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఉండవని కాదు, కాకపోతే మిగతా దేశాలమాదిరి పెద్దగా ఆదరణ ఉండదు. పైగా ఇక్కడి వారు ఫాస్ట్‌ఫుడ్ తినాలనిపిస్తే ఎక్కువగా ఇంట్లోనే తయారు చేసుకుంటారట. అందుకోసం కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఇక్కడి ఫాస్ట్‌ఫుడ్ క్లబ్‌లలో కూడా తక్కువ కేలరీలతో కూడిన ఫుడ్ తయారు చేస్తున్నారు.
ఇష్టంగా తినే ఆహారాలు ఇవే..
జపాన్ ప్రజల బ్యూటీ ట్రెండ్ వెనుక ఉన్న మరో రహస్యం వారు తీసుకునే ఆహారంలో కార్బో హైడ్రేట్స్ అధికంగా, సాచురేటెడ్ ఫ్యాట్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఎక్కువగా చేపలు, రొయ్యలు వంటి సీ ఫుడ్స్, అలాగే ప్రోటీన్ కలిగిన కూరగాయలను తీసుకుంటారు. ఇక వివిధ జంతువుల మాంసాన్ని తక్కువగా తీసుకుంటారు. అధిక సాల్ట్, షుగరింగ్, డెయిరీ ప్రొడక్ట్స్ వంటి ఆహారాలకు దూరంగా ఉంటారు. చాక్లెట్స్, బేకరీ ఫుడ్స్ తినడానికి అస్సలు ఇష్టపడరట. దీంతోపాటు ఒకేసారి ఫుల్లుగా తినడం అనేది ఇక్కడి ప్రజలకు అస్సలు నచ్చదట. తక్కువగా అయినా ఎక్కువసార్లు తింటారు. కానీ ఒకేసారి అధిక కేలరీలను ఎక్కువగా తీసుకోరు. ఇటువంటి ఆహారపు అలవాట్లు జపాన్ ప్రజల్లో అధిక బరువు సమస్య రాకుండా చేస్తున్నాయి. అందుకే ఇక్కడి ప్రజలు స్లిమ్‌గా ఉంటున్నారు.
Read More..