గుండెకు రక్తం సరఫరా చేసే ధమనుల్లో పేరుకుపోతున్న ప్లాస్టిక్స్.. 58 శాతం మందిలో పెరిగిన రిస్క్

ప్లాస్టిక్ వాడకం ఒక ఆరోగ్య సమస్యగా పరిణమిస్తోందని చాలా కాలంగా వింటున్నాం. బాటిల్ వాటర్ నీళ్లలోనూ నానో ప్లాస్టిక్స్ ఉంటున్నాయని నిపుణులు హెచ్చరించారు. తరచూ ప్లాస్టిక్ ఎక్స్‌పోజర్‌కు గురికావడంవల్ల మానసిక రుగ్మతలు, నరాల బలహీనత, క్యాన్సర్లు వంటివి తలెత్తుతాయని గత నివేదికలు కూడా పేర్కొన్నాయి.

Update: 2024-03-08 06:28 GMT

దిశ, ఫీచర్స్ : ప్లాస్టిక్ వాడకం ఒక ఆరోగ్య సమస్యగా పరిణమిస్తోందని చాలా కాలంగా వింటున్నాం. బాటిల్ వాటర్ నీళ్లలోనూ నానో ప్లాస్టిక్స్ ఉంటున్నాయని నిపుణులు హెచ్చరించారు. తరచూ ప్లాస్టిక్ ఎక్స్‌పోజర్‌కు గురికావడంవల్ల మానసిక రుగ్మతలు, నరాల బలహీనత, క్యాన్సర్లు వంటివి తలెత్తుతాయని గత నివేదికలు కూడా పేర్కొన్నాయి. అయితే తాజాగా గుండె జబ్బులు కలిగిన పేషెంట్ల ఆర్టెరీస్ (దమనులు)లోనూ ప్లాస్టిక్స్ ఉంటున్నాయని, మెదడుకు రక్త సరఫరా సక్రమంగా జరగకుండా అడ్డుపడుతున్నాయని, కొన్నిసార్లు సడెన్ హార్ట్‌ ఎటాక్ రావడానికి దారితీస్తున్నాయని ఇటలీకి చెందిన పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది.

వీరిలోనే ఎక్కువ

వాస్తవానికి ధమనులు అనేవి గుండె నుంచి శరీరానికి, శరీరం నుంచి గుండెకు రక్త సరఫరా చేసే ముఖ్యమైన రక్త నాళాలు. అయితే గుండె జబ్బుల బారిన పడినవారిలో దాదాపు సగానికంటే ఎక్కువమంది ధమనుల్లో మైక్రోప్లాస్టిక్స్ ఒక ఫలకంగా ఏర్పడుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. అధ్యయనంలో భాగంగా ఆర్టెరీ డిసీజెస్, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ కలిగిన పేషెంట్లపై దృష్టి కేంద్రీకరించారు. సర్జరీల సమయంలో వారి అవయవాలను ఎనలైజ్ చేశారు. ఈ సందర్భంగా వారు ప్రత్యేకంగా మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే కరోటిడ్ ధమనిలో మైక్రోప్లాస్టిక్స్ ఉంటున్నట్లు కనుగొన్నారు. వీటి విశ్లేషణ కోసం వారు పైరోలిసిస్ - గ్యాస్, క్రోమాటోగ్రఫీ-మాస్ స్పెక్ట్రోమెట్రీ, స్థిరమైన ఐసోటోప్ ఎనలైజింగ్, ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ వంటి అధునాతన పద్ధతులను ఉపయోగించారు.

58 శాతం మందిలో అదే ప్రాబ్లం

హార్ట్ సర్జన్లు కూడా అయినటువంటి ఇటలీ పరిశోధకులు గుండె జబ్బుల రోగుల్లో శస్త్ర చికిత్సల సందర్భంగా ప్రతి 10 మంది రోగులలో ఆరుగురికి వారి ధమనులలో ప్లాస్టిక్ కణాలు కలిగి ఉన్నట్లు గుర్తించారు. ప్రత్యేకంగా పాలిథిలిన్, షాపింగ్ బ్యాగ్స్ అండ్ ప్యాకేజింగ్ మెటీరియల్స్‌ను తయారు చేసే పదార్థాలు 58.4 శాతం మంది రోగుల ఆర్టెరీస్‌లో పెక్కులు లేదా ఫలకం రూపంలో పేరుకుపోయి ఉండటాన్ని కనుగొన్నారు. పైపుల నుంచి వినైల్ రికార్డుల వరకు అన్నింటిలోనూ ఉపయోగించే పాలీ వినైల్ క్లోరైడ్ ఇందులో 12.1 శాతం వరకు ఉందని కూడా తెలిపారు. అయితే అవి మానువులపై ఎలాంటి ప్రభావం చూపుతాయో కూడా పరిశోధకులు అబ్జర్వ్ చేశారు. ఈ సందర్భంగా వారు దాదాపు 34 నెలల సగటు వ్యవధిలో 257 మంది రోగుల ఆరోగ్య ఫలితాలను విశ్లేషించారు. మైక్రోప్లాస్టిక్స్ గుండెపోటు, స్ట్రోక్ లేదా మరణం వంటి తీవ్రమైన హృదయ సంబంధ సంఘటనల ప్రమాదాన్ని పెంచుతాయని వెల్లడించారు.


Similar News