గర్భిణులు వంకాయ కూర తినకూడదా?.. తింటే ఏం జరుగుతుంది?

మహిళల్లో గర్భధారణ అనేది సంతోషకరమైన విషయమే కాకుండా, ఆరోగ్య పరంగా చాలా సున్నితమైనది కూడా. ఈ సందర్భంలో తగిన జాగ్రత్తలు, పోషకాహారం చాలా ముఖ్యం.

Update: 2024-05-20 09:55 GMT

దిశ, ఫీచర్స్ : మహిళల్లో గర్భధారణ అనేది సంతోషకరమైన విషయమే కాకుండా, ఆరోగ్య పరంగా చాలా సున్నితమైనది కూడా. ఈ సందర్భంలో తగిన జాగ్రత్తలు, పోషకాహారం చాలా ముఖ్యం. అయితే గర్భిణులు తీసుకునే ఆహారాల విషయంలో ఇప్పటికీ పలు అపోహలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా వంకాయ తింటే కాళ్లు, చేతులు తిమ్మిర్లు పడతాయని, శరీరంలో నొప్పులు, వాపులు పెరుగుతాయని కొంతమంది నమ్ముతుంటారు. కానీ ఇది వాస్తవం కాదని, కేవలం అపోహ మాత్రమేనని వైద్య నిపుణులు అంటున్నారు. పైగా వంకాయలు తినడం గర్బిణులకు మేలు చేస్తుందని చెప్తున్నారు. అదెలాగో తెలుసుకుందాం.

* వంకాయలో ఆరోగ్యానికి మేలు చేసే అనేక పోషకాలు ఉంటాయి. ప్రెగ్నెన్సీ సమయంలో తినడంవల్ల తల్లీ బిడ్డల ఆరోగ్యానికి ఎంతో మంచిది. పిండం ఎదుగుదలకు, బిడ్డలో మెదడు అభివృద్ధికి ఇది మేలు చేస్తుంది. అలాగే నరాల బలహీనత వంటి సమస్యలకు చెక్ పెడుతుంది.

* విటమిన్ కె, పొటాషియం మెండుగా ఉంటాయి. వంకాయలోని పొటాషియం శరీరంలో ఎలక్ట్రోలైట్లను నియంత్రిస్తుంది. అధిక రక్తపోటును కూడా తగ్గిస్తుంది. ఇక విటమిన్ కె. అధిక రక్త స్రావాన్ని నివారిస్తుంది. డెలివరీ సమయంలో ఇది చాలా కీలకం. కాబట్టి వంకాయ తినడంవల్ల ఎటువంటి నష్టమూ లేదు.

* డైటరీ ఫైబర్ కంటెంట్ కలిగి ఉండటం మూలంగా వంకాయ జీర్ణాశయ ఆరోగ్యానికి మంచిది. ప్రెగ్నెన్సీ సమయంలో తినడంవల్ల గ్యాస్ట్రరైటిస్, మలబద్ధకం వంటి ప్రాబ్లమ్స్ దూరం అవుతాయి. పైగా తక్కువ కేలరీలు ఉంటాయి కాబట్టి అధిక బరువు సమస్యను నియంత్రిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉండటంవల్ల స్ట్రెస్ అండ్ ఇన్‌ఫ్లమేటరీ ఇష్యూస్ నివారణలో వంకాయ అద్భుతంగా సహాయపడుతుంది. ఇదులో ఉండే బయోఫ్లేవనాయిడ్స్, రిబోఫ్లేవిన్ సమ్మేళనాలు హైబీపీని కంట్రోల్ చేస్తాయి. కాబట్టి గర్భిణులు వంకాయను తప్పకుండా తినాలి. తినకూడదు అనేది కేవలం అపోహ మాత్రమే.


Similar News