kitchen sink cleaning tips: కిచెన్ సింక్ నీళ్లతో నిండిపోతూ ఉందా.. అయితే ఈ చిట్కాలతో ఆ సమస్యకు చెక్ పెట్టేయండి

ప్రతీ ఇంట్లో కిచెన్ సింక్ ఏదొక సందర్భంలో జామ్‌ అవుతూనే ఉంటుంది.

Update: 2024-08-09 09:15 GMT

దిశ, ఫీచర్స్ : ప్రతీ ఇంట్లో కిచెన్ సింక్ ఏదొక సందర్భంలో జామ్‌ అవుతూనే ఉంటుంది. ఇది కొందరికి పెద్ద సమస్యగా మారుతుంది. సింక్ లో అలాగే ఉండిపోయినప్పుడు ఏ పనులు కూడా చేయాలనిపించదు. పైప్ లైన్ లో పేరుకుపోయిన మురికిని క్లీన్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అయితే,ఇలా జామ్‌ అయిన సింక్‌లను శుభ్రపరచడానికి ప్లంబర్‌ని పిలిచి చేపిస్తుంటారు. అయినా కూడా ఈ సమస్య కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వస్తుంది. ఇలాంటి సమస్యతో ఇబ్బంది పడే వారు ఈ చిట్కాలను పాటించండి. ఎక్కడో కాదు మీ ఇంట్లో ఉండే వాటితోనే సింక్‌ సమస్యను త్వరగా పరిష్కరించుకోవచ్చు.

వేడి నీరు

సింక్‌ లో నీరు వెళ్లకుండా జామ్‌ అయినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. దానిని మనం వెంటనే క్లీయర్‌ చేయాలంటే వేడి నీటిని ఉపయోగించాలి దీని వలన సింక్‌ కి అటాచ్ అయినా పైప్‌లైన్ మొత్తం క్లీన్ అవుతుంది.

బేకింగ్ సోడా, వెనిగర్

ఒక్కోసారి సింక్ లో కూరగాయల ముక్కలు అడ్డుపడి నీళ్లు అలాగే నిలిచిపోతాయి. దీనికి చెక్ పెట్టాలంటే బేకింగ్ సోడా, వెనిగర్ కలిపిన మిశ్రమం తీసుకుని సింక్‌లో పోయండి. అలా ఐదు నిముషాలు ఉంచిన తర్వాత క్లీన్ చేయటం వల్ల సింక్ మంచిగా అవుతుంది.

ఉప్పు

కిచెన్‌ సింక్‌లను క్లీన్ చేయడానికి ఉప్పు బాగాఉపయోగపడుతుంది. దీని కోసం మీరు కొత్తగా ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఉప్పును సింక్‌ లో వేసి వేడి నీటిని పోసి ట్యాప్ వదలండి. అంతే జామ్ అయినా నీరు మొత్తం పైప్ గుండా వెళ్లిపోతాయి.

Tags:    

Similar News