కడుపుతో ఉన్నప్పుడు జుట్టుకు రంగు వేసుకోవడం సురక్షితమేనా?

స్త్రీ జీవితంలో గర్భధారణ చాలా సున్నితమైన అంశం. ఈ సమయంలో ఏం తినాలి? ఏం తినకూడదు? అనే విషయంలో జాగ్రత్తలు అవసరం. వైద్యుడు చెప్పిన ప్రకారం నడుచుకోవడం ఉత్తమం. అయితే ఈ తొమ్మిది నెలల పీరియడ్ లో జుట్టుకు కలర్ లే

Update: 2024-06-25 17:16 GMT

దిశ, ఫీచర్స్: స్త్రీ జీవితంలో గర్భధారణ చాలా సున్నితమైన అంశం. ఈ సమయంలో ఏం తినాలి? ఏం తినకూడదు? అనే విషయంలో జాగ్రత్తలు అవసరం. వైద్యుడు చెప్పిన ప్రకారం నడుచుకోవడం ఉత్తమం. అయితే ఈ తొమ్మిది నెలల పీరియడ్ లో జుట్టుకు కలర్ లేకుండా అందకపోవడంతో కాస్త డల్ అయిపోయినట్లు కనిపిస్తారు. కాబట్టి హెయిర్ డై వేసుకోవాలని అనుకుంటారు. కానీ కలరింగ్ కరెక్టా కాదా అనే సందేహంతో ఉండిపోతారు. కాగా దీనిపై స్పందిస్తున్న నిపుణులు.. అమ్మోనియా లేని కలర్ వాడొచ్చని సూచిస్తున్నారు. పెరాక్సైడ్ కెమికల్ లేకుండా చూసుకోవాలని చెప్తున్నారు. ఎలాంటి రసాయనాలు లేని నేచురల్ గా తయారు చేసిన ప్రొడక్ట్స్ వాడటం ఉత్తమమని అంటున్నారు. ఎందుకంటే పర్మనెంట్ కలర్స్ లో క్యాన్సర్ కు కారణమయ్యే రసాయనాలు ఉంటాయి.

* ఇక జుట్టుకు రంగు వేయడానికి రెండో త్రైమాసికం అంటే నాలుగు నుంచి ఆరో నెల మధ్య బెటర్ అంటున్నారు. ఎందుకంటే ఫర్ట్ ట్రైమిస్టర్ లో బేబీ డెవలప్మెంట్ ఉంటుంది. ఈ దశ చాలా ఇంపార్టెంట్. ఇక మూడో త్రైమాసికం కూడా బిడ్డ ఎదుగుదల వేగంగా ఉంటుంది. కాబట్టి ఈ పీరియడ్ లో కూడా వద్దని చెప్తున్నారు.

* హెయిర్ కలరింగ్ చేసేటప్పుడు స్కాల్ప్ కు అంటకుండా కేవలం జుట్టుకు మాత్రమే పట్టుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలి. దీనివల్ల బిడ్డకు చిన్న ప్రమాదం కూడా లేకుండా ఉంటుంది. అంతేకాదు జుట్టుకు పూర్తిగా రంగు వేసే అవసరం లేని హెయిర్ స్టైల్స్ ఎంచుకోవం మరింత ఉత్తమంగా పరిగణిస్తున్నారు.

* కెనడాలోని కాలేజ్ ఆఫ్ ఫ్యామిలీ ఫిజిషియన్స్ ప్రకారం గర్భధారణ సమయంలో మూడు నుంచి నాలుగు సార్లు చేసుకోవాలి. అంతకంటే ఎక్కువ సార్లు ప్రయత్నిస్తే రిస్క్ లో పడొచ్చని హెచ్చరిస్తుంది. అంతేకాదు జట్టుకు రంగు వేసుకునేందుకు ఆరు నుంచి ఎనిమిది వారాల గ్యాప్ ఉండేలా చూడాలని... రంగు వేసుకునే సమయంలో తప్పనిసరిగా గ్లౌజులు ధరించాలని సూచిస్తుంది.

* హెయిర్ డైస్ నుంచి వచ్చే ఫ్యూమ్స్ తరచుగా విషపూరితం కావచ్చు. కాబట్టి తగినంత వెంటిలేషన్ ఉన్న గదిలో ఉండేలా చూసుకోండి. ప్రొడక్ట్ పై ఉన్న సూచనల ప్రకారం ట్రై చేయండి. జుట్టు ఎండిన తర్వాత స్కాల్ప్, నుదిటిని బాగా శుభ్రం చేయండి. అలాగే జుట్టుకు రంగు వేసే ముందు ప్యాచ్ టెస్ట్ చేయడం మంచి ఆప్షన్.


పాలు ఇస్తున్న తల్లులు రంగు వేసుకోవచ్చా?

కొన్ని జాగ్రత్తలు అనుసరిస్తూ గర్భధారణ సమయంలో జుట్టుకు రంగు వేయడం సురక్షితమని పలు అధ్యయనాలు పేర్కొన్నాయి. మరి పాలు ఇచ్చే తల్లుల విషయానికి వస్తే.. ప్రమాదకరమా? కాదా? అంటే కాదనే చెప్తున్నారు నిపుణులు. ఎందుకంటే మనం జుట్టుకు వేసుకునే హెయిర్ డై ఏ విధంగానూ తల్లి పాలలోకి ప్రవేశించే అవకాశం లేదు. రసాయనాలు మీ రక్తప్రవాహంలోకి ఏ విధంగానూ ప్రవేశించడం లేదు. కాబట్టి తల్లి పాలు సురక్షితంగా ఉంటాయి. దీంతో బిడ్డకు ఎలాంటి హాని కలగదు. అయితే విషపూరితమైన పౌడర్ లోని ఫ్యూమ్స్ మీ శిశువుకు హాని కలిగించే అవకాశం ఉంది కాబట్టి ఆ గదిలో బిడ్డ లేకుండా జాగ్రత్త పడండి.


Similar News