Health: తరచూ అలసటగా ఉంటుందా.. అయితే కారణం అదే కావొచ్చు

మనలో కొంతమంది చిన్న చిన్న పనులకే అలిసిపోతుంటారు.

Update: 2024-08-15 10:41 GMT

దిశ, ఫీచర్స్ : మనలో కొంతమంది చిన్న చిన్న పనులకే అలిసిపోతుంటారు. ఇలాంటి వారు ఎప్పుడూ కూడా నీరసంగా ఉంటారు. బయట నడిచినా కూడా అలిసి పోతుంటారు. వీరు ఎక్కువగా నిలబడలేరు కూడా.. నిద్ర కూడా సమయానికి పట్టదు. ఒక్కోసారి ఆహారం కూడా సరిగా తీసుకోలేరు. మీరు కూడా ఇలాంటి సమస్యలతో బాధ పడుతున్నట్లయితే అది విటమిన్ బి12 లోపం అని గుర్తించండి. వీటిని నిర్లక్ష్యం చేస్తే చాలా ప్రమాదమని వైద్యులు చెబుతున్నారు.

కొన్ని వ్యాధుల లక్షణాలు మనకి చాలా తేలికగా అనిపిస్తాయి. అందుకే, కొందరు ఏమి పట్టించుకోకుండా ఉంటారు. కానీ దాని వెనుక విటమిన్ లోపం ఉంటుందని తెలుసుకోవాలి. ముఖ్యంగా అలసటను అసలు పట్టించుకోరు. ఒక్కోసారి రోజంతా నీరసంగా, బద్ధకంగా ఉంటారు. ఈ లక్షణాలు మీలో ఉంటే వెంటనే వైద్యుని వద్ద ట్రీట్మెంట్ తీసుకోండి. విటమిన్ బి12 లోపం వలన ఒత్తిడి, చర్మం రంగు మారడం, తలనొప్పి, చెవుల్లో శబ్దాలు రావడం వంటివి ప్రధాన లక్షణాలు.

ఇది మెదడుపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అలాగే ఎర్ర రక్త కణాలు తగ్గిపోయి కొత్త సమస్యలు కూడా వస్తాయి. అలసట, నీరసం వంటి సమస్యలు ఎక్కువవుతాయి. డిమెన్షియా ముప్పు పెరుగుతుంది.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.

Tags:    

Similar News