ఆ పని చేస్తున్నప్పుడు తుమ్మితే అనర్ధం తప్పదా..? ఏ తుమ్ము శుభం.. ఏది అశుభం!
అందరికీ తుమ్ములు రావడం సర్వసాధారణం.
దిశ, వెబ్‌డెస్క్: అందరికీ తుమ్ములు రావడం సర్వసాధారణం. కానీ.. ఎవరైనా బయటకు వెళ్తునప్పుడు, ఏదైనా కార్యక్రమం చేస్తున్నప్పుడు, లేక పూజలప్పుడు తుమ్మితే మాత్రం అరిష్టం అంటారు. వెంటనే చేసే ప్రయాణాన్ని రద్దు చేసుకుంటారు. అంతే కాకుండా పాలు మరిగించేటప్పుడు తుమ్మడం కూడా హానికరమేనని పెద్దలు చెబుతుంటారు. ఇది ఆరోగ్యానికి హానికరమే కాకుండా మీ వ్యక్తిగత జీవితంలో పెద్ద నష్టానికి సంకేతంగా చాలా మంది విశ్వసిస్తారు. మరి నిజంగానే తుమ్ములు అరిష్టమో కాదో తెలుసుకుందాం.
* సాధారణంగా ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు ఆ సమయంలో ఎవరైనా తుమ్మితే అది మంచిది కాదని పెద్దలు అంటారు. అయితే కేవలం ఒక్కసారి
తుమ్మినట్లయితే ఇది పరిగణలోకి తీసుకోవచ్చట. ఒకటి కంటే ఎక్కువ సార్లు తుమ్మినట్లుయితే అది శుభప్రదంగా భావిస్తారట.
* అంతే కాకుండా ఏదైనా పనిమీద వెళ్లేటప్పుడు వెనుక నుంచి ఎవరైనా తుమ్మితే ఆ పని కచ్చితంగా జరుగుతుందట.
ఇవి కూడా చదవండి:
సెక్స్ చాంపియన్ షిప్.. 16 విభాగాల్లో శృంగార క్రీడాపోటీలు.. దరఖాస్తులకు ఆహ్వానం