Soaked Rice: నానబెట్టిన బియ్యాన్ని తినడం మంచిదేనా.. షాకింగ్ నిజాలు చెప్పిన నిపుణులు

నానబెట్టిన బియ్యాన్ని తినడం మంచిదేనా

Update: 2024-08-09 14:48 GMT

దిశ, ఫీచర్స్ : మన దేశంలో ఉదయం, మధ్యాహ్నం, రాత్రి పూట ఎక్కువగా బియ్యాన్నే వండుకుని తింటారు. అది కూడా మనం మితంగానే తీసుకోవాలి. లేదంటే అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వీటిని వండే ముందు బియ్యాన్ని నానాబెడుతుంటారు. అయితే అసలు నానాబెట్టి తినడం మంచిదేనా.. దీని మీద పరిశోధనలు చేసి షాకింగ్ నిజాలు బయటకు వెల్లడించారు.

అరగంట కంటే ఎక్కువ సేపు నానాబెట్టకూడదని అధ్యయనాలు చెబుతున్నాయి. కానీ, ఇది ఇప్పటి నుంచి ఉన్న పద్దతి కాదు పాత కాలం నుంచి దీన్ని పాటిస్తున్నారు. దీని వలన ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని నిపుణులు అంటున్నారు. అవేంటో ఇక్కడ చూద్దాం..

షుగర్ లెవల్స్ తగ్గుతాయి

డయాబెటీస్ ఉన్న వారు అన్నం తినకూడదు. దీని వల్ల బ్లడ్ లో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. కానీ బియ్యాన్ని నానబెట్టి తీసుకోవడంలో వల్ల షుగర్ లెవల్స్ తగ్గిపోతాయి. ఎందుకంటే ఈ నీళ్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తగ్గుతుంది. దీంతో షుగర్ లెవల్స్ అసలు పెరగవు.

మంచి నిద్ర పడుతుంది

బియ్యాన్ని నానాబెట్టి వండి తీసుకోవడం వలన నిద్ర లేమి సమస్య కూడా తగ్గుతుంది. దీనిలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది నిద్రను రాకుండా ఆపేస్తుంది. ఇలా వండిన రైస్ ని తినడం వల్ల నిద్ర బాగా పడుతుంది.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

Tags:    

Similar News