రాత్రి పడుకునే ముందు అరటి పండు తినడం మంచిదేనా?
అరటి పండు ఆరోగ్యానికి చాలా మంచిది. రోజూ ఒక అరటి పండు తినడం వలన అది మనలో ఇమ్యూనిటీని పెంచుతుందని వైద్యులు చెబుతుంటారు. అయితే మన పెద్దవారు రోజూ ఉదయం అరటిపండు తినాలని చెప్తారు.
దిశ, ఫీచర్స్ : అరటి పండు ఆరోగ్యానికి చాలా మంచిది. రోజూ ఒక అరటి పండు తినడం వలన అది మనలో ఇమ్యూనిటీని పెంచుతుందని వైద్యులు చెబుతుంటారు. అయితే మన పెద్దవారు రోజూ ఉదయం అరటిపండు తినాలని చెప్తారు. కానీ కొంత మంది రాత్రి పడుకునే సమయంలో అరటి పండు తింటుంటారు. ఇంకొంత మంది నైట్ షిప్ట్ చేస్తూ ఆకలిగా అనిపించినప్పుడు అరటి పండు తింటారు. అయితే అసలు రాత్రి సమయంలో అరటి పండు తినడం ఆరోగ్యానికి మంచిదేనా? దీని గురించి నిపుణులు ఏమనుకుంటున్నారో, ఇప్పుడు తెలుసుకుందాం.
అయితే రాత్రి నిద్రపోయే ముందు అరటి పండు తినడం ఆరోగ్యానికి మంచిదేనంట. కంటినిండా నిద్రపోవాలంటే ట్రిప్టోఫాన్ ఉన్న ఆహారాన్ని తినాలి. అయితే అరటి పండులో ట్రిప్టోఫాన్ పుష్కలంగా ఉంటుంది. అందువలన నిద్రపోయే ముందు అరటిపండ్లు తింటే హాయిగా నిద్ర పడుతుందని రాయల్ కాలేజ్ ఆఫ్ ఆక్యుపేషనల్ థెరపిస్ట్స్ నిపుణులు అంటున్నారు. అంతే కాకుండా ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.