కట్టెల పొయ్యి మీద వంట ప్రాణానికే ప్రమాదమా?

ప్రతి ఇంట్లో వంట చేసుకోవడం అనేది కామన్. అయితే కొందరు గ్యాస్ మీద వంట చేసుకుంటే, మరికొందరు పొయ్యి లేదా ఎలక్ట్రిక్ కుక్కర్ , ఓవెన్‌లు వంటి వాటి మీద వంట చేసుకుంటూ ఉంటారు. అయితే అసలు

Update: 2024-02-29 14:55 GMT

దిశ, ఫీచర్స్ : ప్రతి ఇంట్లో వంట చేసుకోవడం అనేది కామన్. అయితే కొందరు గ్యాస్ మీద వంట చేసుకుంటే, మరికొందరు పొయ్యి లేదా ఎలక్ట్రిక్ కుక్కర్ , ఓవెన్‌లు వంటి వాటి మీద వంట చేసుకుంటూ ఉంటారు. అయితే అసలు దేనిమీద వంట చేసుకోవడం ఆరోగ్యానికి మంచిది అని ఆలోచిస్తే చాలా మంది కట్టెల పొయ్యి మీద వంట చేసుకోవడం హెల్త్‌కి చాలా మంచిది అంటారు. కానీ ఈవిషయంపై సర్వే చేసిన నిపుణులు షాకింగ్ విషయాలను వెల్లడి చేశారు.

కట్టెల పొయ్యి మీద వంట ప్రాణానికే ప్రమాదకరం అని తెలిపారు.ఇంట్లో ప్రతి రోజూ కట్టెల పొయ్యి మీద వంట చేసుకోవడం వలన వచ్చే పొగ మనకు ఊపిరితిత్తుల వ్యాధులు లేదా క్రానిక్ అబ్ర్స్ట్‌క్టివ్ పల్మనరీ డిసీజ్ అనే ఇన్‌ఫెక్షన్లకు దారితీస్తుందని అధ్యయనం తెలిపిదంట. ఇక భారత దేశంలో మన పూర్వకాలం నుంచి మన పెద్దవారు కట్టెలపొయ్యి మీదనే వంట చేస్తున్నారు. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో ఈ ట్రెండే కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నిపుణులు చేసిన వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్‌గా మారాయి. ముఖ్యంగా కట్టెల పొయ్యి మీద వంట చేసుకునే వారిలో మహిళలు, చిన్న పిల్లలు ఎక్కువగా ఊపిరితిత్తుల వ్యాధి బారిన పడుతున్నట్లు నిపుణులు తెలుపుతున్నారు.


Similar News