ఒకే ట్రిప్‌లో దక్షిణ భారతంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు వెళ్లాలనుకుంటున్నారా.. అయితే మీకే ఈ శుభవార్త

దక్షిణ భారతదేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు అన్నింటిని ఒకే ట్రిప్ లో చూడాలనుకునే వారికి ఇండియన్ రైల్వే శుభవార్తను అందించింది.

Update: 2024-07-06 16:38 GMT

దిశ, వెబ్‌డెస్క్: దక్షిణ భారతదేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు అన్నింటిని ఒకే ట్రిప్ లో చూడాలనుకునే వారికి ఇండియన్ రైల్వే శుభవార్తను అందించింది. IRCTC వారి భారత్‌ గౌరవ్‌ ప్రత్యేక రైలులో భాగంగా ఒకేసారి తిరువణ్ణామలై [అరుణాచలం] – రామేశ్వరం – మధురై – కన్యాకుమారి -త్రివేండ్రం - తిరుచ్చి - తంజావూరు పుణ్యక్షేత్రాల దర్శనం కోసం ఈ ప్రత్యేక రైలును నడపనున్నారు. ఈ రైలు ఆగస్టు 4వ తేదీ నుంచి 12 వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ రైలు కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు & రేణిగుంట మీదుగా వెళ్లనుంది.

ఈ టూర్‌కు సంబంధించిన ప్యాకేజ్‌లో ఈ తొమ్మిది రోజుల యాత్రకుగాను ఒక్కో మనిషికి సెకండ్ క్లాస్ ఏపీ ACరూ. 28,450, థర్డ్ క్లాస్ ఏసీ రూ. 21,900, స్లీపర్ క్లాస్ రూ.14,250 చొప్పున ఛార్జ్ చేస్తున్నారు. ఈ ప్యాకేజీలోనే ఉదయం - కాఫీ / టీ/ అల్పాహారం, మధ్యాహ్నం - భోజనం, సాయంత్రం - స్నాక్స్‌, టీ,కాఫీ, రాత్రి - అల్పాహారం అందిస్తారు. అలాగే క్షేత్రాల సందర్శన సమయాల్లో ప్రత్యేక బస ఏర్పాటు స్లీపర్‌ క్లాస్‌ వారికి నాన్‌ ఏసీ రూమ్‌లు, ఏసీ క్లాసుల వారికి ఏసీ రూమ్‌లు, ఇద్దరికి కలిపి లేదా ముగ్గురు కలిపి ఒక గది ఇస్తారు. కాగా ఈ ట్రిప్ మొత్తం తొమ్మిది రోజుల పాటు ఈ ట్రిప్ కొనసాగనుంది.


Similar News