ఇంట్రెస్టింగ్..మనుషుల మూడ్ స్వింగ్స్ మారడానికి సీజన్‌కు లింక్..! శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారంటే?

వాతవరణంలో మార్పుల వల్ల మనుషుల మూడ్‌ స్వింగ్స్‌ మారుతున్నాయని తాజాగా ఓ అధ్యయనంలో తెలింది. అంతే కాదు వాతవరణం చేంజ్ అయిన ప్రతిసారి వారి మూడ్‌లో కూడా మార్పులు వస్తాయని చెబుతున్నారు.

Update: 2024-03-29 05:21 GMT

దిశ,వెబ్ డెస్క్:వాతవరణంలో మార్పుల వల్ల మనుషుల మూడ్‌ స్వింగ్స్‌ మారుతున్నాయని తాజాగా ఓ అధ్యయనంలో తెలింది. అంతే కాదు వాతవరణం చేంజ్ అయిన ప్రతిసారి వారి మూడ్‌లో కూడా మార్పులు వస్తాయని చెబుతున్నారు.ఈ విషయనికై కొందరిలో అనుమానాలు వ్యక్తం కావచ్చు. అసలు సీజన్ లో మార్పులతో మానవులకు ఏం సంబంధం ఉంటుంది..? దీని గురించి శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారంటే..సీజన్ మార్పుల వల్ల మానవుల మానసిక స్థితిలో, ప్రవర్తనలో చాలా వరకు మార్పులు గమనించవచ్చు.నిజానికి అందరికీ తెలిసిన విషయం కాలానుగుణంగా వచ్చే వ్యాధుల గురించి అదే విధంగా తమ మూడ్ కూడా మారుతుందని చెబుతున్నారు నిపుణులు.

నిజం చెప్పాలంటే కొన్ని సందర్భాలలో కారణం లేకుండానే చిరాకు పడుతుంటాం. మరి కొన్ని వేళలో సంతోషంగా ఉంటాం ఇవి నిత్యం అందరూ గమనిస్తూనే ఉంటారు.అయితే అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే..సీజన్ లో వచ్చే మార్పుల వల్ల మానసిక ఆరోగ్యానికి మధ్య లోతైన సంబంధం ఉందని పేర్కొన్నారు. ఉష్ణోగ్రతలో మార్పు మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు. ఉష్ణోగ్రతలో మార్పు వల్ల ప్రజలు సంతోషంగా లేదా బాధగా భావిస్తారంట.అయితే ప్రజెంట్ ఉన్న వేసవి కాలంలో వ్యక్తులు ఎలా ఉంటారో తెలుసుకుందాం.

వేసవి కాలంలో వ్యక్తుల ప్రవర్తన ఎలా ఉంటుందంటే..

కొందరికి వేసవి కాలం అంటే ఇష్టపడుతారు.అటువంటి వ్యక్తుల మానసిక స్థితి వేడి,ఎండ వాతావరణం లో మెరుగ్గా ఉంటుందని చెబుతున్నారు.ఈ వ్యక్తులు వేసవిలో హ్యాపీగా ఉంటారు అంట. మరికొందరు వేసవిని ఇష్టపడరు. వీరిలో వేడి పెరిగినప్పుడు మానసిక స్థితి క్షీణించడం జరుగుతుంది. ఇలా కాలానుగుణంగా వచ్చే మార్పుల వల్ల వ్యక్తుల మానసిక ఆరోగ్యంపై ప్రభావితం చూపుతుంది.మాయిశ్చరైజర్ పొగమంచు వల్ల మానసికంగా వ్యక్తులను కుంగదీస్తుందనీ తెలిపారు.నిజం చెప్పాలంటే సూర్యకిరణాలు మానసిక స్థితిని మెరుగుపరుస్తాయని పరిశోధుకులు చెబుతున్నారు.


Similar News