ఇంట్రెస్టింగ్ శవాల బూడిదతో హోలీ.. అక్కడ అదే స్పెషల్?
హోలీ పండుగ అంటే అందరికీ ఎంతో ఇష్టం. చిన్న పెద్ద అందరూ ఎంతో ఉత్సాహంతో ఈ రంగుల పండుగ సంబురాలు చేసుకుంటారు. కొందరైతే మార్చి నెల వస్తుందంటే చాలు క్యాలెండర్ లో హోలీ పండుగ ఎప్పుడుందో అని చూస్తారు.
దిశ, వెబ్ డెస్క్ :హోలీ పండుగ అంటే అందరికీ ఎంతో ఇష్టం. చిన్న పెద్ద అందరూ ఎంతో ఉత్సాహంతో ఈ రంగుల పండుగ సంబురాలు చేసుకుంటారు. కొందరైతే మార్చి నెల వస్తుందంటే చాలు క్యాలెండర్ లో హోలీ పండుగ ఎప్పుడుందో అని చూస్తారు. అయితే ఈ రంగుల పండుగ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలుసా? కలర్స్ తో హోలీ ఆడుకోవడం తెలుసు కానీ శవాలను కాల్చగా వచ్చిన బూడిద తో హోలీ పండుగ చేసుకోవడం చూసారా! అయితే ఈ పండుగ వివిధ దేశాల్లో ప్రత్యేకమైన సంప్రదాయలతో జరుపుకుంటారు. ఈ పండుగ ను ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయిన కాశీలో భస్మంతో జరుపుకుంటారు అంటా. దీన్ని వారి భాషాలో మసాన్ హోలీ అంటారు. మన దగ్గర రంగులతో హోలీ ఆడతారు. కానీ అక్కడ మనుషుల శవాలను కాల్చగా వచ్చిన భస్మంతో హోలీ ఆడతారు. అక్కడి హోలీ పండుగ ప్రత్యేకతలు ఏంటో చూద్దాం..కాశీలోని రంగభారీ ఏకాదశి రెండో రోజున మసాన్‌కి హోలీ అనగా శ్మశాన హోలీని శ్మశాన వాటిక అయిన మణికర్ణికా ఘాట్‌లో ఆడతారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి మతపరమైన నగరం. ఇక్కడ హోలీని మహా శ్మశాన హోలీ అని అంటారు. మణికర్ణిక ఘాట్ వద్ద ఈ హోలీని ఆనందంగా, ఉత్సాహంగా జరుపుకుంటారు. ఇక్కడ శివభక్తుల చితాభస్మంతో హోలీ పండుగను ఉత్సాహంగా జరుపుకుంటారు. అయితే ఇది వారి ఆచారం అని చెబుతున్నారు. ప్రతి ఏటా శవాల దగ్గర ఎంతో ఉత్సహంగా ఈ రంగుల పండుగను జరుపుకుంటారు.