Plastic - India : ప్లాస్టిక్ వ్యర్థాల జాబితాలో ఇండియా టాప్.. ఏడాదిలోనే ఇంత దారుణమైన వినాశనమా??

ప్లాస్టిక్(Plastic ) పర్యావరణానికి ముప్పుగా మారింది. మానవ మనుగడను ప్రశ్నార్థకం చేస్తుంది. ఈ పరిస్థితిని అరికట్టేందుకు ప్రభుత్వాలు, స్వచ్చంధ సంస్థలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా... ప్రయోజనం లేకుండా పోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఇదే సిచుయేషన్ నెలకొనగా..

Update: 2024-09-05 08:14 GMT

దిశ, ఫీచర్స్ : ప్లాస్టిక్(Plastic ) పర్యావరణానికి ముప్పుగా మారింది. మానవ మనుగడను ప్రశ్నార్థకం చేస్తుంది. ఈ పరిస్థితిని అరికట్టేందుకు ప్రభుత్వాలు, స్వచ్చంధ సంస్థలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా... ప్రయోజనం లేకుండా పోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఇదే సిచుయేషన్ నెలకొనగా.. ఏటా 57 మిలియన్ టన్నులకు పైగా ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నట్లు తెలిపింది తాజా అధ్యయనం. మొత్తం 90 దేశాలకు సంబంధించిన ర్యాంకింగ్స్ రిలీజ్ చేయగా.. అన్ని దేశాల కంటే భారత్ ఈ విషయంలో టాప్ లో ఉందని... సంవత్సరానికి 10.2 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను ఉత్పత్తి చేస్తుందని గుర్తించింది.

యూనివర్శిటీ ఆఫ్ లీడ్స్ స్కూల్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్‌కు చెందిన కోస్టాస్ వెలిస్ నేతృత్వంలోని పరిశోధకులు... ప్రపంచంలోని 20శాతం ప్లాస్టిక్ వ్యర్థాలు ఇండియా(INDIA) లోనే ఉన్నాయని తెలిపారు. పల్లపు ప్రదేశాల్లో కాకుండా బహిరంగ ప్రదేశాల్లోనే ఈ చెత్త చేరుతుందని.. ఈ పరిశోధనలో ఇంకా గ్రామీణ ప్రాంతాల పడేసే చెత్త, సేకరించని ప్లాస్టిక్‌ను బహిరంగంగా కాల్చడం వంటి సంఖ్యలను మినహాయించామని చెప్పారు. ఇక గత అధ్యయనాల్లో ప్లాస్టిక్ వినియోగం, నిర్వహణలో చైనా ముందున్నా.. ప్రస్తుతం ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణలో అనేక చర్యలు తీసుకుందని, నాలుగో స్థానాన్ని ఇచ్చారు.

అధిక-ఆదాయ దేశాల్లోనే ప్లాస్టిక్ వ్యర్థాలు అధికంగా ఉన్నప్పటికీ.. వాటిని నిర్వహించడం, నియంత్రించడం కూడా చేస్తున్నాయి. మొత్తానికి ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణలో US సాపేక్షంగా తక్కువ స్థానంలో ఉంది. సంవత్సరానికి 52,500 టన్నులను మాత్రమే ఉత్పత్తి చేస్తుందని తెలిపింది అధ్యయనం.

Tags:    

Similar News