ఆరోగ్యంతోపాటు ఆనందంగా ఉండాలా?.. ఇవి పాటిస్తే చాలు !

జీవితంలో ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలనుకుంటున్నారా?.. అయితే మీరు తప్పకుండా పాటించాల్సిన టెక్నిక్స్ కొన్ని ఉన్నాయంటున్నారు నిపుణులు. అలాంటి వాటిలో హెల్తీ ఫుడ్స్‌తోపాటు రోజువారీ వ్యాయామాలు కూడా ఉన్నాయి.

Update: 2024-04-16 07:38 GMT

దిశ, ఫీచర్స్ :  జీవితంలో ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలనుకుంటున్నారా?.. అయితే మీరు తప్పకుండా పాటించాల్సిన టెక్నిక్స్ కొన్ని ఉన్నాయంటున్నారు నిపుణులు. అలాంటి వాటిలో హెల్తీ ఫుడ్స్‌తోపాటు రోజువారీ వ్యాయామాలు కూడా ఉన్నాయి. వాస్తవానికి ఆహారం శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. సానుకూల ప్రభావం చూపాలంటే విలువైన పోషకాలు కలిగిన తాజా కూరగాయలు, పండ్లు, వివిధ పోషకాలు కలిగిన పదార్థాలను ఆహారంలో భాగంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

అలాగే తిన్న ఆహారం శక్తిని ఇవ్వాలంటే తగిన శారీరక శ్రమ అవసరం. కేలరీలు బర్న్ చేయగలిగే పనులు, వర్కవుట్‌లు ఇందుకు దోహదపడతాయి. రోజూ వ్యాయామం చేయడం ద్వారా జీవక్రియలు మెరుగు పడటంతోపాటు మనసు తేలిక పడుతుంది. వ్యాయామం కోసం ప్రతిరోజూ జిమ్‌కే వెళ్లాలనేమీ లేదు. అలసిపోయే వరకు వేగంగా నడిచినా, రన్నింగ్ చేసినా మేలు జరుగుతుందని నిపుణులు అంటున్నారు.

పోషకాహారంలో భాగంగా తాజా కూరగాయలతోపాటు బచ్చలి కూర, తోటకూర, పుట్ట గొడుగులు, టొమాటోలు, ఎర్రటి మిరియాలు, కూరగాయల జ్యూస్ కూడా తీసుకుంటూ ఉండాలి. ఇక కొందరు స్వీట్లు, జంక్ ఫుడ్స్ తినడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇవి ఆరోగ్యానికి మంచిది కాదు. ఆరోగ్యంతోపాటు కండరాలు క్షీణించకుండా ఉండాలంటే ప్రోటీన్లు ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవాలి. పోషకాలు, ప్రోటీన్లు కలిగిన ఆహారం, రోజూ వ్యాయామం ఉండేలా చూసుకుంటే జీవితంలో ఆరోగ్యంతోపాటు ఆనందంగా ఉండగలుగుతారని నిపుణులు చెప్తున్నారు.


Similar News