ప‌బ్లిక్‌లో ప్ర‌పోజ్ చేశాడు, ఆ త‌ర్వాత పాపం ఇలా..?! (వీడియో)

ఒక మహిళకు ప్రపోజ్ చేసిన వ్యక్తికి ఈ పీడకల నిజమైంది. Man Proposes To His Girlfriend At A Crowded McDonald's

Update: 2022-05-04 11:10 GMT

దిశ‌, వెబ్‌డెస్క్ః జీవితంలో చాలా భ‌య‌ప‌డే స‌మ‌యం ఏంటంటే ప్రేమించిన వాళ్ల‌కి ప్ర‌పోజ్ చేయ‌డ‌మే. ఎన్నో క‌ల‌లు క‌న్న‌త‌ర్వాత వాళ్ల‌కి మీలో ఉన్న ప్రేమ తెలియ‌జేయాల‌నుకుంటారు. అయితే, ఇద్ద‌రు వ్య‌క్తుల మ‌ధ్య ఒకే ఆలోచ‌న ఉండాల‌ని ఏముంది..? మ‌నం ఒక‌టి అనుకుంటే ఎదుటివారు మ‌రోలా ఆలోచించ‌వ‌చ్చుక‌దా..?! అప్పుడు, కుడి ఎడ‌మై మ‌న ప్ర‌పోజ‌ల్ రిజ‌క్ట్ కూడా కావ‌చ్చు. అందులోనూ, ప‌బ్లిక్‌ ప్ర‌పోజ‌ల్స్ కాస్త ఇబ్బందిక‌రంగానే మారొచ్చు. ఇలాగే, రద్దీగా ఉండే మెక్‌డొనాల్డ్స్ అవుట్‌లెట్‌లో ఒక మహిళకు ప్రపోజ్ చేసిన వ్యక్తికి ఈ పీడకల నిజమైంది. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లోని మెక్‌డొనాల్డ్స్ శాండ్‌టన్ బ్రాంచ్‌లో క్యూలో నిలబడి ఉన్న త‌న ప్రియురాలికి ఈ వ్యక్తి ప్రపోజ్ చేశాడు. అయితే, అది కాస్తా త‌ల్ల‌కిందులైంది..!

అత‌డు ఆమెకు ప్ర‌పోజ్ చేస్తున్న‌ప్పుడు చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు 'ఎస్' చెప్ప‌మ‌ని ఆమెను ప్రోత్సహించినా, ఉత్సాహంగా కేక‌లు వేస్తున్నా. ఆమెకు మాత్రం ఖచ్చితంగా ఈ అత‌న్ని అంగీకరించే ఆలోచన లేక‌పోవ‌డంతో, నిర్మొహ‌మాటంగా ఆ విష‌యాన్ని చెప్పేస్తుంది. ఆ తర్వాత ఆమె అవుట్‌లెట్ నుండి వెళ్లిపోగా, చివ‌రికి అత‌డు సిగ్గుతో కూడిన బాధ‌తో వెళ్లిపోతాడు. ఈ తంతును త‌మ ఫోనుల్లో బంధించిన వారిలో ఉన్న @Madame_Fossette ఈ ఘ‌ట‌న‌ వీడియోను త‌న ట్వీట్ట‌ర్‌లో షేర్ చేయ‌గా, నెటిజ‌న్లు భిన్నంగా స్పందించారు. కొంతమంది అత‌ని పట్ల జాలి చూపించగా, ఇంకొంద‌రు ప‌బ్లిక్‌గా ప్ర‌పోజ్ చేయ‌డం మంచి ఆలోచన కాదని అన్నారు. ఇప్పుడీ వీడియో సోష‌ల్ మీడియాలో చక్క‌ర్లు కొడుతోంది.


Similar News