వర్షంలో తడవకుండా బాతుకు రెయిన్ కోటు.. ఎంత ముచ్చటగా ఉందో..!
వీడియో ఖచ్చితంగా మన ముఖంలో చిరునవ్వును తెప్పిస్తుంది. A Woman Makes Raincoat For Drenched Duck.
దిశ, వెబ్‌డెస్క్ః తీవ్రమైన చలిలో, ఎండలో, ముఖ్యంగా వర్షాల్లో జంతువులు చాలా ఇబ్బందులు ఎదుర్కుంటాయి. సహాయం కావాలని మాటల్లో కూడా చెప్పలేవు. ఇలాంటి మూగ జంతువుల పట్ల చిన్నపాటి దయతో కూడిన చర్యలే మానవత్వంలో ఉన్న గొప్పతనాన్ని తెలియజేస్తాయి. అలాంటి ఓ క్యూట్ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. మదర్ ది మౌంటైన్ ఫార్మ్ పోస్ట్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ వీడియో ఖచ్చితంగా మన ముఖంలో చిరునవ్వును తెప్పిస్తుంది. ఈ వీడియోలో 'బీ' అనే అందమైన చిన్న బాతును చూడొచ్చు. నిజానికి, ఈ బాతు ఈకలన్నీ వర్షంలో తడిసిపోయి, తీవ్రమైన చలితో ఉన్నట్లు కనిపిస్తుంది. తనను తాను పొడిగా ఉంచుకోవడం ఆ సమయంలో దానికి చాలా అవసరంలా కనిపిస్తుంది. అప్పుడే, ఈ మహిళ బీకి అందమైన ఒక రెయిన్ కోటును తయారుచేస్తుంది. దాన్ని ధరించిన బాతు బుడిబుడి నడకలు వేస్తూ వెళుతుంటే చాలా అందంగా, ఆనందంగా అనిపిస్తుంది. ఇప్పటి వరకూ ఈ వీడియోకు 4.5 మిలియన్లకు పైగా వ్యూవ్స్ రాగా, ఆ మహిళను ప్రశంసిస్తూ అనేక కామెంట్స్ వచ్చాయి. మీరూ చూడండి..