బాధతో రోడ్డుపైన కూర్చుంటే.. కుక్కొచ్చి ఇలా చేసింది..?! (వీడియో)
అలాంటి ఒక ఫన్నీ సంఘటన ఒక వీడియోలో కనిపిస్తుంది. A Stray Dog Pees On Sad Girl & Casually Walks Away.
దిశ, వెబ్‌డెస్క్ః ప్రతిరోజూ ఇంటర్నెట్లో ఆసక్తికరమైన ఫన్నీ వీడియోలు చాలా షేర్ అవుతుంటాయి. అయితే, కొన్ని ఫన్నీ సంఘటనలు చూసే వారికి బాగున్నా వీడియోలో అనుభవించిన వారికి ఇబ్బంది కలిగిస్తాయి. అలాంటి ఒక ఫన్నీ సంఘటన ఒక వీడియోలో కనిపిస్తుంది. ఒక అమ్మాయి రోడ్డుపక్కన కూర్చుని, మొకాళ్లలో తల పెట్టుకొని, బాధగా ఉన్నట్లు కనిపిస్తుంటే, ఆమె వెనుకగా రోడ్డుపైన వెళ్తున్న కుక్క ఒకటి ఆ అమ్మాయిపై మూత్ర విసర్జన చేసి, తర్వాత ఏమీ జరగనట్లుగా దూరంగా వెళ్లిపోతుంది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. కుక్కలు ఎంతో క్యూట్‌గా, నమ్మకమైన జీవులని మనందరికీ తెలుసు. అయితే, కొన్ని సమయాల్లో అవి ఇలా నాటీగా ప్రవర్తిస్తాయి కూడా. సీసీటీవీ ఫుటేజీలో రికార్డ్ అయిన ఈ వీడియోను యానిమల్స్ బీయింగ్ జెర్క్స్ అనే ట్విటర్ ఖాతా షేర్ చేయగా, లక్షల్లో వీక్షణలు వచ్చాయి. మరీ కామెడీగా ఈ వీడియో శీర్షిక, "ఇదిగో, నేను నిన్ను ఓదార్చనివ్వు" అని ఉంటుంది.
Here, let me comfort you😂 pic.twitter.com/oGaMZ6915q
— Animals Being Jerks (@Animalbelngjerk) May 18, 2022