ప్రామిస్ డే: ఇలా ప్రామిస్ చేసి మీ లవర్‌ను ఇంప్రెస్ చేయండి!
ప్రామిస్ డే. వాలెంటైన్ వీక్‌లో ఐదవ రోజున ప్రామిస్ డేగా జరుపుకుంటారు. ప్రామిస్ అంటే వాగ్దానం. తమ ప్రియమైన వారికి నేను మమీకు తోడుగా ఉంటాను, ఏ కష్టం రాకుండా చూసుకుంటాను అని వాగ్దానం
దిశ, ఫీచర్స్ : ప్రామిస్ డే. వాలెంటైన్ వీక్‌లో ఐదవ రోజున ప్రామిస్ డేగా జరుపుకుంటారు. ప్రామిస్ అంటే వాగ్దానం. తమ ప్రియమైన వారికి నేను మమీకు తోడుగా ఉంటాను, ఏ కష్టం రాకుండా చూసుకుంటాను అని వాగ్దానం చేస్తుంటారు. అయితే ఇలాంటి వాగ్దానాలు చేసేటప్పుడు, కాస్త ఆలోచించి క్రియేటివ్‌గా చెప్పాలంట. మనం చేసే ప్రామిస్‌తో ఎదుటి వారు ఒక్కసారిగా ఇంప్రెస్ అయిపోయి, మన లవ్ ఒకే చేసేలా ఉండాలంట.
లవ్ వీక్ కాబట్టి. కాస్త రొమాంటిక్‌గా, నేను నీకు అండగా, ఉంటానని భరోసా ఇవ్వాలంట. ఇలాంటి ప్రామిస్ చేసేటప్పుడు ముఖ్యంగా మీరు ఉన్న ప్రదేశాన్ని చూసుకోవాలి. అదమైన గ్రీనరిగా ఉండే ప్లేస్ లేదా ఏదైనా కలర్ ఫుల్‌గా ఉండే ప్లేస్‌లో ప్రామిస్ చేయడం చాలా మంచిదంట. మరీ ముఖ్యంగా మీ ప్రియమైన వారికి నచ్చే ప్రదేశంలో ప్రామిస్ చేయడం వలన వారు ఇంప్రెస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుందంట. అయితే మీరు ప్రామిస్ చేసే టప్పుడు ఈ కొటేషన్స్‌తో చెప్పండి వారు మీ లవ్ యాక్సెప్ట్ చేయడం ఖాయం.
నీ లక్ష్యాన్ని సాధించడానికి నేను ఎల్లప్పుడూ నీకు సపోర్ట్‌గా ఉంటాను,నీ ప్రతీ సమస్యలో నేను నీకు ధైర్యంగా ఉంటాను అంటూ ప్రామీస్ చేయండి. మీలాంటి భాగస్వామి ఉన్నందుకు వారు గర్వపడతారు.అలాగే మీరు ప్రేమించిన వ్యక్తి కళ్లలోకి చూసి ఈ ప్రపంచంలో నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తి నువ్వేనని, నువ్వు తప్ప నా జీవితంలో వేరేవారికి చోటు లేదని చెప్పండి. ఆ క్షణాన్ని వాళ్లు ఎప్పటికీ మరచిపోలేరు. నీ నీడలా నీతో ఉంటాను అని మాట ఇవ్వండి. దీంతో మీలవర్ ఈజీగా పడిపోతుంది. అదే విధంగా, మన మధ్య గొడవలు జరగడం సాధారణమే అని మీ భాగస్వామికి చెప్పండి. ప్రాణం పోయినా నిన్ను వదలను అని మాట ఇవ్వండి. ఈ ఒక్క మాటతో ఆమె చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది. మీ బంధం మరింత బలపడుతుంది.