మీ పిల్లలు ఫాస్ట్ ఫుడ్ ని దూరం పెట్టాలంటే.. ఇలా ట్రై చేయండి..!

ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ ఆరోగ్యానికి హానికరమని, ఇప్పటికే పలు పరిశోధనల్లో తేలింది.

Update: 2024-06-17 11:16 GMT

దిశ, ఫీచర్స్: ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ ఆరోగ్యానికి హానికరమని, ఇప్పటికే పలు పరిశోధనల్లో తేలింది. ఎందుకంటే, దీనిలో కొవ్వు, చక్కెర, ఉప్పు ఉంటుంది. దీనిలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు తక్కువగా ఉంటాయి. ఇన్ని విషయాలు తెలిసినా కానీ.. పిల్లలు, పెద్దలు ఇద్దరూ ఈ ఫుడ్స్ ని ఇష్టంగా తింటారు. వారంలో ఒకసారి తింటే ఏమి అనిపించదు.. కానీ రోజు అదే పనిగా తింటే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా పిల్లల్లో, జంక్ ఫుడ్ తిన్న తర్వాత వ్యాయామం చేయకపోవడం వల్ల అనేక సమస్యలు వస్తాయి. అటువంటి పరిస్థితిలో, మీ పిల్లల అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల నుంచి ఎలా దూరం పెట్టాలో ఇక్కడ తెలుసుకుందాం..

మీరు, మీ పిల్లలకు ఫాస్ట్ ఫుడ్స్ కి బదులు.. వారి స్నాక్ బాక్స్‌లో డ్రైఫ్రూట్స్ పెడితే ఇష్టంగా తింటారు. మీ పిల్లలకు చిరుతిండి పెట్టెలనుకుంటే.. పండ్లను ఇవ్వండి.

ఆరోగ్యకరమైన ఆహారం

మీరు వారికి ఒకే రకం ఆహారం కాకుండా, కొత్త ఆహారాన్ని అందిస్తే, వారు హ్యాపీగా తింటారు. వివిధ రకాల పండ్లు, కూరగాయలు, బీన్స్ , చిక్కుళ్ళు తినాలని పెట్టుకోండి. మీ పిల్లల భోజనానికి వెరైటీ ఫుడ్స్ ని చేర్చడం వలన కుటుంబ విందులలో విసుగు చెందకుండా ఉంటారు.

ఆహారాన్ని కలర్ ఫుల్ గా తయారు చేయండి

పిల్లలు ఎప్పుడైనా కొత్త రకం ఆహారాన్ని ఇష్టపడతారు. ఇంట్లో మీ పిల్లలకు రంగురంగుల, ప్రోటీన్స్ ఉన్న ఆహారాన్ని ఇవ్వడానికి ప్రయత్నించండి. ఆహారం పట్ల పిల్లల ఆసక్తిని పెంచండి.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.


Similar News