మోకాళ్ల నలుపు పోవాలంటే.. ఈ టిప్స్ పాటించండి..!
సాధారణంగా చాలామందికి మోచేతులు, మోకాళ్లు నలుపు రంగులో ఉంటాయి.
దిశ, ఫీచర్స్: సాధారణంగా చాలామందికి మోచేతులు, మోకాళ్లు నలుపు రంగులో ఉంటాయి. శరీరం ఒక రంగులో ఉంటే ఇవి కాస్త నలుపు రంగులో ఉంటాయి. వీటిని తగ్గించుకునేందుకు రకరకాల రసాయనాలను వాడుతుంటారు. అలా కాకుండా ఇంట్లోనే మోకాళ్ల నలుపును పోగొట్టుకోవాలంటే ఈ చిట్కాలను పాటించండి.
కొబ్బరి నూనె: కొబ్బరి నూనె నలుపు రంగును తగ్గిస్తుంది. రెగ్యులర్‌గా కొబ్బరి నూనెతో మర్దనా చేస్తే నలుపును తగ్గించుకోవచ్చు. దీని వల్ల చర్మం సాఫ్ట్‌గా ఉంటుంది.
అరటి తొక్క, తేనె: అరటి తొక్కపై తేనె వేసి మోకాళ్లపై మర్దనా చేయాలి. ఇలా 5 నిమిషాల పాటు మర్దనా చేసి, శుభ్రంగా కడిగేయాలి. ఇది మోకాళ్ల నలుపును తగ్గించడంలో సహాయపడుతుంది. అరటి తొక్క, తేనె వల్ల చర్మం మాయిశ్చరైజ్ అవుతుంది.
శనగపిండి: శనగపిండి, టమాటను కలిపి మోకాళ్లు, మోచేతులకు మర్దనా చేసి, అలాగే 30 నిమిషాల పాటు వదిలేయాలి. తరువాత శుభ్రంగా కడిగేయాలి.
నారింజ స్క్రబ్: మోకాళ్ల నలుపును తగ్గించడానికి నారింజ స్క్రబ్ ఉపయోగపడుతుంది. ఓ టీ స్పూన్ కాఫీ పొడిని, టీ స్పూన్ కొబ్బరి నూనెలో కలపాలి. ఆ తరువాత నారింజ తొక్కతో ఆ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుంటూ 10 నిమిషాల పాటు మర్దనా చేసి, నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే నలుపు రంగు తగ్గుతుంది.
నిమ్మరసం: నిమ్మరసం మోకాళ్లపై ఉన్న నలుపు రంగును తొలగించడంలో సహాయపడుతుంది. నిమ్మరసంలో కొద్దిగా పంచదార వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని టమాట ముక్కతో మోకాళ్లపై సున్నితంగా స్క్రబ్ చేయాలి. ఇలా వారంలో రెండు సార్లు చేయడం వల్ల ఫలితం ఉంటుంది.
ఆలివ్ ఆయిల్: పంచదార, ఆలివ్ ఆయిల్ నలుపు రంగును తగ్గిస్తుంది. ఆలివ్ ఆయిల్లో పంచదార వేసుకొని, సున్నితంగా స్క్రబ్ చేయాలి. తరువాత సబ్బు నీటితో కడిగేయాలి. ఇలా వారానికి ఒక సారి చేస్తే సరిపోతుంది.