సంపాదించినా డబ్బు నిలవాలంటే.. వీటిని ఫాలో అవ్వండి..!

కొందరి దగ్గర ఎంత సంపాదించినా డబ్బు అసలు నిలవదు.

Update: 2024-03-22 13:31 GMT

దిశ, ఫీచర్స్: కొందరి దగ్గర ఎంత సంపాదించినా డబ్బు అసలు నిలవదు. ప్రతి ఒక్కరూ డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు చాలా ఆలోచిస్తారు. ఇలా చేయకుంటే ఎంత డబ్బు సంపాదించినా ఉండదు. అలాంటి సమయంలో వీటిని ఫాలో అవ్వండి. అవేంటో ఇక్కడ చూద్దాం..

అప్పులు వద్దు..

వీలైనంత వరకు అప్పులు తీసుకోకండి. ఈ కారణంగా, మీరు ఎంత సంపాదించినా, తీసుకున్న డబ్బులకు వడ్డీ కట్టడమే సరిపోతుంది. కాబట్టి వీలైనంత వరకు అప్పులకు దూరంగా ఉండటం మంచిది.

ఎమర్జెన్సీ ఫండ్..

ఎప్పుడు ఏ అవసరం వస్తుందో ఎవరికి తెలియదు. కాబట్టి ముందుగానే ఆలోచించండి దీని కోసం కొంత డబ్బు ఆదా చేసుకోండి. ఇది అత్యవసర నిధిలో భాగంగా ఉపయోగించవచ్చు. కాబట్టి కొంత డబ్బు పక్కన పెట్టండి.

ఇన్వెస్ట్‌మెంట్..

చాలా మంది ఆర్థికంగా విజయవంతమైన వ్యక్తులు తమ డబ్బును పెట్టుబడి పెట్టే అలవాటును కలిగి ఉంటారు. కొంతమంది స్టాక్‌ మార్కెట్లో పెడుతుంటారు. వాటిలో ఏదో ఒకటి ఎంచుకుని పెట్టుబడి పెట్టడం మంచిది.


Similar News