వాటిని నీటిలో వేసుకుని స్నానం చేస్తే.. అదృష్టం వరించినట్లే..
మనిషి రాత్రి పడుకున్నప్పటి నుంచి ఉదయం నిద్ర లేచే వరకు ఒంట్లో ఓ రకమైన బద్ధకం ఆవహించి ఉంటుంది.
దిశ, వెబ్ డెస్క్ : మనిషి రాత్రి పడుకున్నప్పటి నుంచి ఉదయం నిద్ర లేచే వరకు ఒంట్లో ఓ రకంగా బద్ధకంగా ఉంటుంది. అందుకే పొద్దున్నే లేవగానే దారిద్య్ర దేవత మనలో తాండవం చేస్తుంది. పొద్దున లేవగానే ఏ పని చేయకుండా అలాగే పడుకోవడం, కూర్చోవడమే చేస్తే సోమరితనం మనను ఆవహిస్తుందనడంలో సందేహం లేదు. అందుకే ఉదయాన్నే అభ్యంగన స్నానం చేయాలంటారు పెద్దలు. అభ్యంగనము అంటే తల మీద నుంచి స్నాయం చేయడం.
అలా చేయడం వల్ల ఒంట్లో నూతనోత్సాహం కలిగి రోజంతా చురుగ్గా ఉంటారు. అయితే.. మనం స్నానానికి సిద్ధం చేసుకున్న నీటిలో మనం వేసుకునే వస్తువుల బట్టి మనకు అదృష్టం వరిస్తుందని పురణాలు చేబుతున్నాయి. ముఖ్యంగా స్నానం చేసే నీటిలో కాస్తంత పసుసు వేసుకుని స్నానం చేస్తే.. పేరు ప్రతిష్టలు, కీర్తి, డబ్బు కలుగుతుందట. అదేవిధంగా గంధం కలిపిన నీటితో స్నానం చేస్తే.. ఏ పని చేపట్టినా విజయం కలుగుతుందని నమ్మకం. అదేవిధంగా శరీరంలో ఒత్తిడి తగ్గి అనార్యోగ్యం బారిన పడే అవకాశం ఉండదట. తులసి ఆకులు, గులాబీ రేకులతో స్నానం చేస్తే మనకు కావాల్సిస పనులు కూడా సకాలంలో పూర్తవుతాయని పురాణాలు చెబుతున్నాయి.