దిశ, వెబ్‌డెస్క్ : పండ్లలో రారాజైన మామిడి పండు తినకుండా ఎవరూ ఉండలేరు. వేసవి వచ్చిందంటే చాలు.. అంతా మామిడి పండ్ల వైపే చూస్తారు. మామిడి పండ్లలో రకాలు చాలా ఉన్నాయి. పుల్లగా.. అదిరిపోయే రకం ఒకటైతే.. అమృతంలా తియ్యటి తీపి కలిగిన రసాలూరే పండ్లు మరో రకం. ఇటు పచ్చి ముక్కగా కాకుండా.. అటు రసంగా కాకుండా మెత్తగా నోట్లోకి పోయే బంగినపల్లి రకం మరో రకమైంది. ఇటు పచ్చి ముక్కగా కాకుండా.. అటు రసంగా కాకుండా మెత్తగా నోట్లోకి పోయే రకం బంగినపల్లి. ఇది భారతదేశపు జాతీయఫలం. ఫలాల్లో రాజైన ఈ పండు వేసవిలోనే విరివిగా లభిస్తుంది. పుల్లటి కాయలను ఊరగాయలు పెట్టుకుంటారు. తియ్యటి పళ్లను పిల్లలు, పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. మామిడి కాయలను కోసి వాటిమీద కారం, ఉప్పు చల్లుకుని తింటే ఆ మజానే వేరుగా ఉంటుంది.
అసలు ఆ మామిడి పండ్లు ఎన్ని రకాలో చూద్దాం..
ఆంధ్రప్రదేశ్‌లో బంగినపల్లి, సువర్ణరేఖ, నీలం, తోతాపురి వంటి మామిడి పళ్ల రకాలు పండిస్తారు. హిమాచల్ ప్రదేశ్‌లో ఆరు రకాల మామిడి పండ్లు దొరుకుతాయి. చౌసా, దసేహరి, లంగ్రా, అల్పోన్సో, కేసర్, పైరి రకాలు ఈ రాష్ట్రంలో ఫేమస్. గుజరాత్‌లో 8 రకాల మామిడి పండ్లను రైతులు పండిస్తారు. కేసర్, అల్ఫాన్సో, రాజాపురి, జామాదార్, తోతాపురి, నీలమ్, దసేహరి, లంగ్రా పండ్లు గుజరాత్‌లో యమ ఫేమస్. బిహార్ వాసులకి కూడా మామిడి పండ్లు అంటే ఎంతో ప్రీతి. బాంబే గ్రీన్, చౌసా, దసేహరి, ఫాజిలి, గుల్బకాస్, కిసేన్ బోగ్, హిమ్ సాగర్, జర్దాలు, లంగ్రా వంటి పండ్ల రకాలు బిహార్‌లో దొరుకుతాయి. కర్ణాటకలో ఆల్ఫాన్సో, తోతాపురి, బంగినపల్లి, పైరి, నీలం, ముల్ గోవా వంటి మామిడి పండ్లు రకాలు లభిస్తాయి. మధ్యప్రదేశ్‌లో ఆల్ఫాన్సో, బాంబే గ్రీన్, దసేహరి, ఫాజిలి, లంగ్రా, నీలం వంటి రకాలకు యమా డిమాండ్ ఉంది.
మామిడి పండులో ఆరోగ్య సూత్రాలు
వేసవిలో మీ అందం, ఆరోగ్యాన్ని రెట్టింపు చేసుకోవాలంటే.. తప్పకుండా మామిడి పండ్లను తినాల్సిందే. మామిడి పండ్లలో ఐరన్ కూడా లభిస్తుంది. రక్తహీనత సమస్యతో బాధపడేవారికి మామిడి పండ్లు మంచి ఔషధం కూడా. మామిడి పండులో రోగనిరోధక శక్తిని పెంచే బీటా కెరోటిన్ అనే పదార్థం ఉంటుంది. కరోనా సీజన్‌లో రోగ నిరోధక శక్తిని పెంచుకోడానికి ఇది ఎంతో సహకరిస్తుంది. మామిడి పండ్లలో విటమిన్-C తో పాటు విటమిన్ A, విటమిన్ B6, విటమిన్ K, ప్రొటీన్, ఫైబర్, ఫోలిక్ యాసిడ్, పొటాషియం ఉంటాయి. వీటి వల్ల ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు దరి చేరవు. మామిడి వల్ల జుట్టు కూడా ఆరోగ్యకరంగా ఉంటుంది. మామిడి పండ్లలో ఉండే ఖనిజాలు గుండె జబ్బులు రాకుండా కాపాడతాయి. చర్మ సౌందర్యానికి మామిడిని మించిన పండు లేదు.
Also Read..
యమ డేంజర్.. కాకరకాయతో కలిపి ఈ ఆహార పదార్థాలు అస్సలు తినొద్దు