మీ ఇంట్లో ఈ వస్తువులు ఉన్నాయా..? అయితే మీకు కష్టాలు తప్పవట!
ఇంటికి వాస్తు పాటిస్తే ఇంట్లోకి సానుకూల శక్తి వస్తుంది. వాస్తు నియమాల ప్రకారం ఇల్లు కట్టుకుని, ఇంట్లో వస్తువులు పెట్టుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
దిశ, ఫీచర్స్: ఇంటికి వాస్తు పాటిస్తే ఇంట్లోకి సానుకూల శక్తి వస్తుంది. వాస్తు నియమాల ప్రకారం ఇల్లు కట్టుకుని, ఇంట్లో వస్తువులు పెట్టుకుంటే మంచి ఫలితం ఉంటుంది. కొంత మంది పట్టింపు లేకుండా ఉంటారు. కానీ వాస్తు.. కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ప్రశాంత జీవనానికి నిర్దేశించడం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇదంతా బాగానే ఉంది. అయితే అన్ని వాస్తు ప్రకారం చూసుకున్నా .. ఇంట్లో కొన్ని వస్తువులు ఉండటం మూలంగా చాలా అనార్థాలకు దారితీస్తుంది. మరి ఇంతకీ ఏంటా వస్తువులు ఇప్పుడు చూదాం.
*వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని వస్తువులు ఉంచితే ఆర్థికపరమైన సమస్యలు వస్తాయి. అందులో ఫస్ట్ కాక్టస్ (ముళ్ల మొక్కలు) మొక్క. ఈ జాతి మొక్కలు ఇంట్లో ఉండకూడదు. చాలా వరకు గులాబీ చెట్లు పెట్టుకుంటారు. కానీ మంచిది కాదు అన్ని శాస్త్రాలు చెబుతున్నాయి.
* ఇక చాలా మంది పాత న్యూస్ పేపర్లు.. ఇంట్లో అవసరం వస్తాయి అని పడేయకుండా అలా ఉంచుకుంటారు. కొంత మంది అమ్ముకునే ఉద్దేశంతో స్టోర్ చెస్తారు. కానీ మంచిది కాదు. అలాగే తుప్పు పట్టిన తాళాలు కూడా ఇంట్లో ఉండకూడదు. చాలా చిక్కులు తెచ్చిపెడుతుంది.
* పాత, పనిచేయని గడియారాలు, విరిగిపోయిన బొమ్మలు ఇంట్లో ఉంచకూడదు.
* చాలా మందికి నీటి విలువ తెలియదు. అనవసరంగా ఇంట్లో నీటిని వృథా చెస్తుంటారు. కానీ నీటిని ఎక్కువగా వేస్ట్ చేసే వారి ఇంట్లో ఆర్థిక సమస్యలు ఎక్కువవుతాయి. ధన వ్యయం పెరుగుతుంది. వ్యాపారంలో అనుకోని నష్టాలు సంభవిస్తాయి. అందుకే కిచెన్‌లోనో, బాత్‌రూమ్‌లోనో ఇలా ఎక్కడైనా ఇంట్లో లీక్ అయ్యే వాటర్ టాప్స్ ఉంటే వాటిని వెంటనే రిపేర్ చేయించండి. నీరు వృథా కాదు.. డబ్బూ పోదు.
*ఇల్లు అందంగా కనిపించడం కోసం.. కొంతమంది సముద్రాలు, పడవలు, ఓడలు వంటి సీనరీ తెచ్చుకొని, ఇంట్లో గోడలకి తగిలిస్తారు. కానీ పడవలు ఉండే ఫొటోస్ గాని, బొమ్మలు గాని ఇంట్లో ఉండకూడదు. ఇలాంటి బొమ్మలు ఇంట్లో ఉంటే కుటుంబ సమస్యలు ఎక్కువవుతాయి. క్రూరమృగాల బొమ్మలు, యుద్ధ సన్నివేశం ప్రతిబింబించే ఫోటోలు వంటివి కూడా ఇంట్లో ఉంచుకోకూడదు.
* ఇక ఇంట్లో అలంకరించుకోవడానికి చాలా మంది ప్లాస్టిక్ పువ్వులు మొక్కలు తీసుకొచ్చి వాడుతుంటారు. వీటి బదులు వీలైతే ఇండోర్ ప్లాంట్.. మనీ ప్లాంట్, లక్కీ ప్లాంట్ వంటివి అందమైన గాజు సీసాలో పెట్టుకుని అలంకరించుకుంటే.. ఇంట్లో అందానికి అందం.. ఆరోగ్యం లభిస్తుంది.