భార్య బర్త్ డేను మర్చిపోతే అంతే సంగతులు.. అక్కడ భర్తలను జైల్లో వేస్తారట !

ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని ముఖ్యమైన సందర్భాలు ఉంటాయి. అవి వారికి చాలా సంతోషాన్ని ఇస్తుంటాయి. బర్త్ డేలు, వెడ్డింగ్ యానివర్సరీలు కూడా అలాంటివే. ప్రియమైన వ్యక్తి స్పెషల్ డేను గుర్తు పెట్టుకోవడం, విష్ చేయడం ఇరువైపులా ఆనందాన్ని కలిగిస్తుంది.

Update: 2024-06-04 07:34 GMT

దిశ, ఫీచర్స్ : ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని ముఖ్యమైన సందర్భాలు ఉంటాయి. అవి వారికి చాలా సంతోషాన్ని ఇస్తుంటాయి. బర్త్ డేలు, వెడ్డింగ్ యానివర్సరీలు కూడా అలాంటివే. ప్రియమైన వ్యక్తి స్పెషల్ డేను గుర్తు పెట్టుకోవడం, విష్ చేయడం ఇరువైపులా ఆనందాన్ని కలిగిస్తుంది. భార్యా భర్తల విషయంలో అయితే మరింత ప్రత్యేకం. అయినప్పటికీ భార్య బర్త్ డేను భర్త మర్చిపోవడం సాధారణంగా జరిగిపోతూ ఉంటుంది. ఆ తర్వాత భార్య అలగడం.. భర్త సర్ది చెప్పడంతో పరిస్థితి సద్దుమణగడం కామన్. కానీ సమోవా దేశంలో మాత్రం అలా కాదు. ఇక్కడ ఏ వ్యక్తి అయినా సరే తన భార్య పుట్టిన రోజు తేదీని మర్చిపోవడం నేరం. పైగా ఆ వ్యక్తికి జైలు శిక్ష కూడా వేస్తారట.

వినడానికి వితంగా అనిపిస్తుంది కానీ సమోవా దేశంలో భర్త తన భార్య బర్త్ డేను మర్చిపోవడం చట్ట విరుద్ధం. ఈ నేరానికి గాను ఏకంగా 3 నుంచి 4 ఏండ్లు జైలు శిక్ష వేస్తారట. ఇక్కడ అమలవుతున్న భార్యా హక్కుల చట్టం ప్రకారం.. భర్త తన భార్య పుట్టిన రోజును ఫస్ట్ టైమ్ మర్చిపోయినట్లయితే.. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు మొదటిసారి తప్పుగా వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారట. ఇక రెండవసారి అదే రిపీట్ అయితే మాత్రం భర్తకు గరిష్ఠంగా ఐదేండ్లు జైలు శిక్షతోపాటు జరిమానా కూడా విధిస్తారు.

అంతేకాకుండా తమ పుట్టిన రోజును మర్చిపోయిన భర్తలపై మహిళలు చేసే ఫిర్యాదులను స్వీకరించడానికి సమోవా దేశంలోని పోలీసు వ్యవస్థలో ప్రత్యేక బృందాలు ఉంటాయి. చట్టంపై అవగాహన కల్పించడానికి ఈ ప్రత్యేక టీమ్‌లు అవేర్‌నెస్ క్యాంపులను కూడా నిర్వహిస్తుంటాయి. అందుకే అక్కడి పురుషులు ఏది మర్చిపోయినా.. భార్య పుట్టిన రోజును మాత్రం మర్చిపోయే చాన్స్ ఉండదట. ప్రజెంట్ ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుండగా.. ఇండియాలో గనుక ఇలాంటి చట్టం వస్తే భర్తలతో జైళ్లు నిండిపోతాయంటూ పలువురు సరదా కామెంట్లు చేస్తున్నారు.

ఇదీ వాస్తవం..

నిజానికి సమోవా దేశంలో భార్య పుట్టిన రోజును మర్చిపోయే భర్తకు జైలు శిక్ష విధించే ట్టాలు ఏవీ లేవు. కానీ అలా ఉన్నట్లు 2007 నుంచి ఇక్కడ ఓ అర్బన్ మిథ్ (అవాస్తవం) ప్రచారంలో ఉంది. అక్కడి ప్రభుత్వానికి కూడా ఇది తెలుసు. ఈ దేశంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా మరెక్కడ కూడా జీవిత భాగస్వామి పుట్టిన రోజును మరిచిపోవడం నేరంగా పరిగణించే ఆచారం, చట్టం, జైలు శిక్ష అనుభవించడం వంటి దాఖాలాలు ఏవీ లేవు. 


Similar News