మంగళవారం రోజున ఇవి పాటిస్తే.. మీరు పట్టిందల్లా బంగారమే..!

ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోజూ స్పెషల్ డే ఉంటుంది

Update: 2023-05-02 05:06 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోజూ స్పెషల్ డే ఉంటుంది. ఆ రోజున వారికి అంతా మంచే జరగాలని ఇష్టమైన దేవుడి ఆలయాలకు వెళ్తుంటారు. కొంతమంది ఇంట్లోనే దేవుడిని పూజిస్తారు. అలాగే ఉపవాసం కూడా ఉంటారు. ముఖ్యంగా ఎక్కువ మంది మంగళవారాన్ని ప్రత్యేక దినంగా భావిస్తారు. ఆ రోజున ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధిస్తారు. అయితే మంగళవారం కొన్ని పద్ధతులు పాటించడం వల్ల ఎంతో మేలు జరుగుతుందట. అవేంటో చుద్దామా..

* మంగళవారం సూర్యోదయానికి అరగంట ముందు లేచి, ఇంటి ముందు శుభప్రదంగా ముగ్గు వెయ్యాలి.

* అలాగే సుగంధ ద్రవ్యాలు వెదజల్లే పువ్వులను కూడా ఆ ముగ్గులో ఉంచాలి.

* ఆ రోజున ఇంటి నేలను నీటిలో రాతి ఉప్పును ఉపయోగించి కడగాలి.

* తలంటు స్నానం చేసి, ఎప్పుడు ధరించే బట్టలను విడిచి కొత్తబట్టలను వేసుకోవాలి.

* ఇంటి గేటు ముందు ముళ్ల మొక్కలు, పొదలు ఉండకుండా చూసుకోవాలి.

*నార్త్, ఈస్ట్ కిటికీలు తెరిచి ఉంచి సౌత్, వెస్ట్ కిటికీలు మూసి ఉంచాలి.

*సాయంత్రం 7 గంటలకు ముందు తలుపులు మూయవద్దు.

* అలాగే రాత్రిపూట ఉప్పు తీసుకుని ఎరుపు రంగు గుడ్డలో మూట కట్టి, ఇంటి ద్వారం ముందు తగిలించాలి.

* మరుసటి రోజూ ఆ ఉప్పుని తీసుకుని ఏదైనా చెట్టు మొదట్లో వేస్తే మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది.

* ఈ విధంగా చేస్తే మీ ఇంటికి ఉన్న దోషాలన్నీ పోతాయి. ఇలా నెలలో ఒకసారి తప్పకుండా చేస్తే మీకు అంతా మేలే జరుగుతుంది.

Read more:

పిల్లలు కూరగాయలు తినడం లేదా?.. అయితే ఇలా చేయండి

Tags:    

Similar News