రోజూ రెండు ఖర్జూరం పండ్లు తింటే.. ఎన్ని లాభాలో తెలుసా..?

మనలో చాలా మంది ఖర్జూరాన్ని ఇష్టంగా తింటారు

Update: 2024-06-22 07:01 GMT

దిశ, ఫీచర్స్: మనలో చాలా మంది ఖర్జూరాన్ని ఇష్టంగా తింటారు. వీటిలో పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుండి శరీరాన్ని రక్షిస్తుంది. రోజుకు రెండు ఖర్జూరాలు తినడం మన శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ చూద్దాం ..

ఖర్జూరంలో విటమిన్ బి6, కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే పీచు కారణంగా జీర్ణక్రియ మెరుగపరచి, మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది. ఖర్జూరం గుండె ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. దీన్ని తినడం వలన కొలెస్ట్రాల్‌ను తగ్గి, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

వయసు పెరిగే కొద్దీ ఎముకలు బలహీనపడతాయి. దీనిలో కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం ఉంటాయి. ఖర్జూరం తింటే మీ ఎముకలు దృఢంగా తయారవుతాయి. ఎముకల క్షీణత, బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడంలో ఖర్జూరం ప్రయోజనకరంగా ఉంటుంది.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.


Similar News