Betel Leaf: రోజూ పరగడుపున ఈ ఆకు తిన్నారంటే ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు..

మన చుట్టూ ఎన్నో రకాల ఔషధ చెట్లు ఉంటాయి

Update: 2024-08-05 05:56 GMT

దిశ, ఫీచర్స్: మన చుట్టూ ఎన్నో రకాల ఔషధ చెట్లు ఉంటాయి. అలాగే మొక్కలు కూడా ఉంటాయి. ఈ ఔషధ మొక్కలు మన శరీరంలోని ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెడతాయి. ఇంకా మన ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. అలాంటి మొక్కల్లో తమలపాకులు కూడా ఒకటి. ఇవి ఆకులే కాకుండా వేర్లు కూడా ఉపయోగపడతాయి. వీటిని పరగడుపున తీసుకుంటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇక్కడ చూద్దాం..

తమలపాకులు శరీరాన్ని రోగాల బారిన పడకుండా కాపాడతాయి. దీని ఉపయోగం మన ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఇది పెరగడానికి ఎక్కువ స్థలం లేదా ప్రత్యేక స్థలం అవసరం లేదు. చిన్న కుండీలో నాటినా లో తీగలుగా పెరుగుతుంది.

గొంతు సమస్యలకు, దంత ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అనేక వ్యాధుల చికిత్సలో ఇది ముఖ్యపాత్ర పోషిస్తుందని ఆయుర్వేద నిపుణులు పేర్కొంటున్నారు. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. ఇది జలుబు నుంచి ఉపశమనం పొందేలా పొందుతుంది. అంతే కాకుండా ఇది గుండె సమస్యలకు చెక్ పెడుతుంది.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

Tags:    

Similar News