శివరాత్రి రోజు ఇలా చేస్తే ఇష్టమైన వ్యక్తితో పెళ్లి అవుతుందంట?
మహా శివరాత్రి ఎంతో పర్వదినం. ఈ రోజు భక్తులందరూ నిష్టగా ఉపవాసాలు ఉంటారు. తీరొక్క పండ్లు తీసుకొచ్చి స్వామి వారికి నైవేద్యంగా పెట్టి పూజ చేసుకుంటారు.
దిశ, వెబ్డెస్క్ : మహా శివరాత్రి ఎంతో పర్వదినం. ఈ రోజు భక్తులందరూ నిష్టగా ఉపవాసాలు ఉంటారు. తీరొక్క పండ్లు తీసుకొచ్చి స్వామి వారికి నైవేద్యంగా పెట్టి పూజ చేసుకుంటారు.
ఇక శివరాత్రి అంటే శివ పర్వాతుల కళ్యాణం జరిగే రోజు, వీరిద్దరిని ఆది దంపతులు అంటారు. అలాంటి ఈ పర్వదినం రోజున పెళ్లి కానివారు శివపార్వతులను ఇలా కొలుచుకుంటే పెళ్లికి ఉన్న అడ్డంకులన్నీ తొలిగిపోయి, కోరుకున్న వ్యక్తితో త్వరగా పెళ్లి జరుగుతుందంట.
అయితే శివ రాత్రి రోజు పెళ్లి కాని వారు, శివపర్వాతుల విగ్రహాలను సమీప ఆలయానికి తీసుకెళ్లి, శివ పార్వతుల చుట్టూ ఏడు సార్లు ప్రదక్షణ చేయాలంట అంతే కాకుండా ఎర్రటి వస్త్రాలు ధరించి కోరికలను నెరవేర్చమని శివున్నీ తల్లి పార్వతిని ప్రార్థించాలంట. అలా చేయడం వలన త్వరగా పెళ్లి కావడమే కాకుండా, ఇష్టమైన వ్యక్తితో పెళ్లి జరుగుతుందంట.
ఇవి కూడా చదవండి : కిక్కెక్కించే ఆలయం.. భక్తులకు తీర్థంగా మందు పంపిణీ.. మీరూ వెళ్లొచ్చు!